Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి తర్వాత సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారిన వాళ్లలో రవితేజ ఒకడు. ఆయన చేసిన సినిమాలు తనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా రవితేజ వరుస ప్లాప్ లలో ఉండడంతో అతన్ని చాలామంది దర్శకులు పట్టించుకోలేదు. ఇక బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు సైతం భద్ర మూవీతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో బోయపాటి శ్రీను రవితేజ తో ఒక సినిమా చేయడానికి అవకాశం దొరికిన కూడా బోయపాటి మాత్రం రవితేజని పట్టించుకోలేదట కారణమెంటంటే అప్పుడు తనకు సరైన మార్కెట్ లేదని వరుస ప్లాప్ లలో ఉన్నాడు. కాబట్టి అతనితో సినిమా చేస్తే వర్కౌట్ కాదని బోయపాటి భావించాడు. కానీ రీసెంట్ గా ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమా ప్లాప్ అవ్వడంతో అతనికి అవకాశాలను ఇచ్చే హీరోలు కరువయ్యారు.
దాంతో ఆయన రవితేజ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రవితేజ అప్పట్లో పట్టించుకోని బోయపాటి ఇప్పుడు రవితేజ తో సినిమా చేయాలనుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
నిజంగానే బోయపాటి రవితేజతో సినిమా చేస్తాడా లేదా అనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే బోయపాటికి ఇప్పుడు సినిమాలను ఇచ్చే స్టార్ హీరోలు కరువయ్యారు. దాంతో రవితేజ అయితేనే తనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని మరోసారి తనతో మాస్ యాక్షన్ సినిమాని తెరకెక్కించవచ్చని బోయపాటి భావిస్తున్నారట.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన భద్ర క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. లవ్ స్టోరీస్ లో భద్ర కి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందా లేదా అనేది…