Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన మహేష్ బాబు చేసిన సినిమాలకు గొప్ప గుర్తింపైతే ఉంటుంది. ఆయన చేసిన సినిమాలు నెక్స్ట్ లెవల్లో గుర్తింపును సంపాదించుకుంటాయి. ఆయన చేసిన సినిమాలకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం… నిజం, వన్ లాంటి సినిమాలతో తన నటన ప్రతిభను బయటకు తీసిన ఆయన ఇప్పటికీ మంచి క్యారెక్టర్ దొరికితే అదే పొటెన్షియాలిటీని బయటపెట్టే క్రమంలో నటించి మెప్పించగలిగే సత్తా కూడా తనకు ఉంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో నటనకు ఎక్కువగా స్కోప్ ఉన్న నేపథ్యంలో అందులో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈరోజు మహేష్ బాబు కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంతటి గొప్ప వసూళ్లను రాబడుతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది…
తన కెరియర్ స్టార్టింగ్ లోనే మహేష్ బాబు మంచి సినిమాలను చేసి గొప్ప హీరోగా పేరు సంపాదించుకున్నాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన దూకుడు లాంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించాడు. అలాంటి హీరో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకోవాలి.
కానీ అలా దక్కించుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే కెరియర్ స్టార్టింగ్ లో ఆయన శ్రీమంతుడు సినిమా వరకు కూడా డైరెక్టర్ల మీద నమ్మకంతోనే సినిమాలను చేస్తూ వచ్చాడు. దీనివల్లే ఆయన చాలావరకు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి. తద్వారా బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.
ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆయన అలాంటి తప్పులైతే చేయడం లేదు…ఇదేదో అప్పుడే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆయన ఇప్పటికి నెంబర్ వన్ హీరో అయ్యేవాడు అంటు పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఆయనకున్న ఈ ఒక్క బ్యాడ్ హాబిట్ వల్లే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోలేదంటూ పలువురు సినీ విమర్శకులు సైతం చెబుతుండడం విశేషం…