Gunasekhar Comments On Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరోక ఎత్తుగా మారబోతున్నాయి. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో చేస్తున్న సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… ఇక మహేష్ బాబు తో వరుసగా సినిమాలు చేయడం వల్లే తన కెరీర్ ని పోగొట్టుకున్నాను అంటూ ఒక దర్శకుడు సంచలన కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? మహేష్ బాబుతో ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చూడాలని ఉంది సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు గుణశేఖర్…ఆయన మహేష్ బాబుతో ఒక్కడు మూవీ చేసి భారీ విజయాన్ని సాధించాడు. తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో ఆ తర్వాత అర్జున్, సైనికుడు అంటూ వరుసగా గుణశేఖర్ మూడు సినిమాలను చేయడం విశేషం…
అయితే మహేష్ బాబుతో సినిమా చేసిన తర్వాత మనం ఆయనతో తప్ప వేరే వాళ్ళతో సినిమా చేయలేమని, ఆయన చూపించే ప్రేమ, ఆయన ఒక సీన్ కోసం పడే కష్టం మనల్ని ఆకర్షిస్తోంది. ఇక మనం మిగతా వాళ్ళతో సినిమాలు చేసినా కూడా మనకు మహేష్ బాబే కనిపిస్తూ ఉంటాడని చెప్పాడు. అలాగే మహేష్ బాబు తో సినిమా చేసి వేరే వాళ్ళతో సినిమా చేయలేక నాకు కెరియర్ ను పోగొట్టుకున్నాను అంటూ ఆయన గతంలో సంచలన కామెంట్స్ చేశాడు.
అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా గుణశేఖర్ లాంటి దర్శకుడు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…