Namitha: నార్త్ బ్యూటీ నమిత సౌత్ లో స్టార్ గా వెలిగింది. దర్శకుడు శ్రీను వైట్ల ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2002లో విడుదలైన సొంతం ఆమె మొదటి చిత్రం. సొంతం హిట్ కాగా వెంటనే వెంకటేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. తమిళ రీమేక్ జెమినీ చిత్రంలో నమిత మార్వాడీ అమ్మాయి పాత్రలో అలరించింది. జెమినీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమె తమిళంలో బిజీ అయ్యారు.
తెలుగులో ఆమె నటించిన హిట్ చిత్రాల్లో బిల్లా, సింహ ఉన్నాయి. బిల్లా మూవీలో గ్లామరస్ రోల్ చేసింది. సింహలో హాట్ లెక్చరర్ పాత్రలో ఆకట్టుకుంది. నమితకు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. అభిమానులు ఏకంగా నమితకు గుడి కట్టారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే నమిత లావై పోయారు. ఆజానుబాహురాలైన నమిత బరువు పెరిగాక షేప్ అవుట్ అయ్యింది.
సాధారణంగా హీరోయిన్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వ్యాయామం చేస్తూ, డైట్ ఫాలో అవుతూ బరువు పెరగకుండా చూసుకుంటారు. నమిత శరీరం మీద శ్రద్ద వదిలేసింది. అందుకే లావై పోయిందని కథనాలు వెలువడ్డాయి. అయితే నమిత లావైపోవడానికి అనారోగ్య సమస్యలే కారణం అట. నమితకు థైరాయిడ్, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయట.
దీంతో ఆమె మెడిసిన్ వాడరట. ఆ మెడిసిన్ వలనే నమిత విపరీతంగా బరువు పెరిగిందట. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా వల్ల కాలేదట. ఇటీవల ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నమిత 2017లో బిజినెస్ మాన్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. 2022లో నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది.