Photo Story: విజయశాంతి తర్వాత వెండితెర పై లేడీ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి. సూపర్ అనే చిత్రం తో కెరీర్ ని మొదలు పెట్టిన అనుష్క, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ ఈమె కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘అరుంధతి’. అప్పటి వరకు కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన అనుష్క, ఈ చిత్రం లో అద్భుతంగా నటించి, ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సరికొత్త ఊపిరి పోసింది. ఇక ఆ తర్వాత ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే,మరో పక్క హీరోయిన్ గా నటిస్తూ ఇండియా లోనే టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. బాహుబలి చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్న అనుష్క, ఆ తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది.
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘భాగమతి’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో భారీ హిట్ ని అందుకున్న అనుష్క, ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం తో మన ముందుకొచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె మళ్లీ కొంత గ్యాప్ తీసుకొని నటించిన ‘ఘాటీ’ చిత్రం రీసెంట్ గానే విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అనుష్క ఒక చిన్నారితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిన్నారిని ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది కదూ?, ఈమె ప్రభాస్ సలార్ చిత్రం లోని బ్లాక్ బస్టర్ ఫైట్ ఎపిసోడ్ కాటిరమ్మ సీక్వెన్స్ లో కనిపిస్తుంది.

ఈమె కోసం ప్రభాస్ విలన్స్ అందరిని చంపేస్తాడు. ఆ సన్నివేశాన్ని, అందులో నటించిన ఈ చిన్నారిని అంత తేలికగా మనం మర్చిపోలేము. ఈమె అసలు పేరు సయ్యద్ ఫర్జానా. ఈ సినిమాకు ముందు కూడా ఈమె అనేక సినిమాల్లో నటించింది. విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రంలో కూడా ఈమె నటించింది. అంతకు ముందు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. అంతే కాకుండా IPL యాడ్స్ తో పాటు, ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్రోమో లో కూడా ఈ చిన్నారి కనిపించింది. కొన్ని స్కూల్ యాడ్స్ లో కూడా తళుక్కుమని మెరిసింది. అయితే ఎన్నిట్లో కనిపించినా ఈమెకు బాగా గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం సలార్ సినిమాలోని కాటేరమ్మ ఫైట్ సన్నివేశమే. ఇప్పుడు ఈమె ఎలా మారిపోయిందో మీరే చూడండి. త్వరలోనే ఈమె ఒక వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో కనిపించనుంది.