Photo Story: పైన కనిపిస్తున్న ఫొటోలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో ఉన్న ఈ పిల్ల గ్యాంగ్ ని గుర్తు పట్టారా..?, ఇందులో ఒకరు ఇప్పుడు మాస్ మరియు యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని క్రేజీ స్టార్ గా ముందుకు దూసుకుపోతున్నాడు. అదే విధంగా క్యాప్ పెట్టుకున్న ఆ వ్యక్తి ప్రస్తుతం ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. దాదాపుగా అందరి హీరోలతో కలిసి సినిమాలు చేసి హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ఫోటో ఎప్పటిది అంటే ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ సమయం లోనిది. వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రమిది. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత కూడా గుర్తుపట్టలేకపోతున్నారా?, వాళ్ళు ఎవరో కాదండీ రౌండ్ మార్క్ చుట్టి ఉన్న కుర్రాడు రామ్ పోతినేని(Ram Pothineni), క్యాప్ పెట్టుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).
రామ్ పోతినేని తండ్రి ఒక ప్రముఖ నిర్మాత అనే సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళ బ్యానర్ పేరు స్రవంతి మూవీస్.ఈ బ్యానర్ లోనే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. అప్పట్లో త్రివిక్రమ్ ఎలా ఉన్నాడో మీరే చూడండి. అసలు గుర్తు పట్టలేకపోతున్నాం కదా. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి ఎదో సాధించాలని వచ్చాడు. పట్టుదలతో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళాడు. అప్పట్లో వెంకటేష్ ఆల్ టైం క్లాసిక్స్ అయినటువంటి ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, త్వరలోనే వెంకటేష్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం లో వీళ్ళ కాంబినేషన్ సినిమా రానుంది.
ఇక రామ్ పోతినేని విషయానికి వస్తే, గతం లో ఆయన వెంకటేష్ తో కలిసి ‘మసాల’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో నిల్చినప్పటికీ వెంకటేష్, రామ్ కాంబినేషన్ మాత్రం ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. భవిష్యత్తులో వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటిస్తారో లేదో తెలియదు కానీ,నటిస్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు అనే చెప్పాలి. ఇక రామ్ విషయానికి వస్తే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తప్పనిసరి. మరి ఈ చిత్రం తో గాడిలోకి వస్తాడో లేదో చూడాలి.