Photo Story: ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ హీరో సినిమాల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఈ హీరో ఒకపక్క సినిమాలతో మరొక రాజకీయాలతో బాగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఒక స్టార్ హీరో చిన్ననాటి ఫోటో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న కురాళ్లలో ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడు. అతని పేరు చెప్తే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఆయన సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది అంటే అక్కడ జాతర నెలకొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో కోసం ఆయన అభిమానులు ప్రాణాలు కూడా ఇస్తారు. ప్రస్తుతం ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవ కోసం రాజకీయాలలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: ఈ స్టార్ హీరోయిన్ తొలి పారితోషకం కేవలం రూ.10.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్…ఎవరంటే..
ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాలలో చాలా బిజీగా ఉన్న ఈ హీరో తర్వాత సినిమా కోసం ఆయన అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న స్టార్ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరుకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్ అందుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ మలుపు తిరగడంలో ప్రధాన పాత్ర పోషించింది. బద్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, జానీ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోపాటు పుస్తక భగత్ సింగ్, ఓజి వంటి సినిమాలు కూడా సెట్స్ పైన ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.
View this post on Instagram