Nayanthara: నయనతార భర్త డే నేడు. 1984 నవంబర్ 18న జన్మించిన నయనతార 39వ ఏట అడుగు పెట్టింది. నయనతార సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు. రెండు దశాబ్దాలుగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నయనతార స్టార్ గా వెలిగిపోయింది. ఇటీవల జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ కి జంటగా నయనతార నటించిన జవాన్ ఆల్ టైం హిందీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ చేసింది.
బాలీవుడ్ లో కూడా నయనతార సత్తా చాటింది. నయనతార సినిమాకు రూ. 10 కోట్లకు వరకూ తీసుకుంటుందని ఒక అంచనా. కెరీర్లో సూపర్ సక్సెస్ అయిన నయనతార జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా లవ్ ఎఫైర్స్ తో ఆమె పతాక శీర్షికలు ఎక్కింది. కెరీర్ బిగినింగ్ లోనే నయనతార… నటుడు శింబుతో ఎఫైర్ నడిపింది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శింబు, నయనతార ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
శింబు, నయనతార వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా విడిపోయారు. శింబుతో బ్రేకప్ తర్వాత ప్రభుదేవకు దగ్గరైంది. పెళ్ళై పిల్లలు ఉన్న ప్రభుదేవతో పబ్లిక్ గా తిరిగింది. ప్రభుదేవ భార్య రామలత నయనతార మీద కేసు పెట్టింది. నానా రచ్చ జరిగింది. రామలతకు ప్రభుదేవ విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవ-నయనతార పెళ్ళికి సిద్ధమయ్యారు. త్వరలో పెళ్లి అనగా బ్రేకప్ అయ్యారు.
వీరిద్దరితో నయనతార ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో నయనతార ఓ సందర్భంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ… నమ్మకం లేని చోట ప్రేమకు తావు లేదు. ఆ ఇద్దరికి నాకు మధ్య అపార్థాలు, మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దాని వలన ఒకరిపై మరొకరికి నమ్మకం పోయింది. అలాంటప్పుడు విడిగా ఉంటేనే మంచిదని నిర్ణయించుకున్నాము. ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టాన్ని అయినా భరిస్తాను. బ్రేకప్ డిప్రెషన్ నుండి బయటపడేందుకు నేను చాలా కష్టపడ్డాను… అని అన్నారు. 2015లో దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార 2022లో వివాహం చేసుకుంది.