Bangladesh vs Australia : ఇటీవల సంత దేశంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తద్వారా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తన స్థాయిని మరింత పెంచుకుంది. ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మతిరిగే ఫలితాన్ని ఇచ్చింది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ అద్భుతాన్ని సాధించింది. ఆస్ట్రేలియా జట్టుకు వారి సొంత దేశంలోనే దిమ్మతిరిగే ఫలితం ఇచ్చింది. వాస్తవానికి ఇలాంటి ఫలితం ఎదురవుతుందని ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం అంచనా వేయలేదు. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ విభాగాలలో బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శన చేసింది. తద్వారా ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది అంటే ఆస్ట్రేలియా ఆట తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ ఎదుట కేవలం 57 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఆస్ట్రేలియా విధించగలిగింది. దానిని బంగ్లాదేశ్ కేవలం ఒకే వికెట్ మాత్రమే కోల్పోయి సాధించగలిగింది.. రెండవ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కాస్త సమర్థవంతంగానే ఉన్నప్పటికీ.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం గ్రీన్ (104) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ప్లేయర్లు బంగ్లా బౌలర్ల బౌలింగ్ కు దాసోహం అయ్యారు.
ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 198 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. 372 పరుగుల లీడ్ సంపాదించింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రీన్ సెంచరీ చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. గొప్ప గొప్ప బ్యాటర్లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా బంగ్లా బౌలింగ్ మొత్తానికి దాసోహం అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఫినిష్ చేసింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డమీద చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. ఆస్ట్రేలియా గడ్డమీద ఇది తొలి విజయం. పైగా ఆస్ట్రేలియా మీద ఆ జట్టు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలవడం టెస్ట్ క్రికెట్లోనే సరికొత్త అధ్యాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన చేస్తోంది బంగ్లాదేశ్. పాకిస్తాన్ దేశంలోనే పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసింది. ఇటీవల సొంత దేశంలో జరిగిన సిరీస్లో పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ రేసులో బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. ఒకవేళ ఆస్ట్రేలియా పై సిరీస్ విజయాన్ని సాధిస్తే బంగ్లాదేశ్ ర్యాంకు మెరుగుపడతాయి. నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ర్యాంక్ దిగజారే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సరిగా లేకపోవడం.. బౌలింగ్ సమర్థవంతంగా లేకపోవడంతో ఈ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది.
image.png