Agni Pareeksha 2 Judges : రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ పై సోషల్ మీడియా నెటిజెన్స్ లో తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పర్చుకుంది. గత సీజన్ లో కూడా నెగెటివిటీ ఉండేది కానీ , ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ నుండే నెగెటివిటీ ప్రారంభమైంది. ముఖ్యంగా జడ్జీలు సామాన్యులతో వ్యవహరిస్తున్న తీరు ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళని మనుషులు లాగా చూడడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం జడ్జీలు మాత్రమే, కానీ ఎదో ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుళ్ళు లాగా వ్యవహరిస్తున్నారు, ‘బిగ్ బాస్’ షో ని నిర్వహించే ‘ఎండమోల్ షైన్ ‘ సంస్థ కూడా ఇంత అతి చేయరేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అందుకు ఉదాహరణగా నిన్నటి ఎపిసోడ్ లో కొన్ని సంఘటనలు జరిగాయి. అక్షయ్ రాజ్ అనే పాపులర్ ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ నిన్నటి ఎపిసోడ్ లో ఆడిషన్ ఇచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ లో సమాజం లో జరిగే కొన్ని అంశాల పై రోస్టింగ్ చేయడం నా టాలెంట్ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు జడ్జీలు , మా నలుగురిని రోస్టింగ్ చెయ్యి , చూద్దాం ఎలా ఉంటుందో అని అంటాడు. కానీ అక్షయ్ రాజ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత నీకు నచ్చిన టాపిక్ ని తీసుకొని , దాన్ని రోస్ట్ చేయమని అంటారు జడ్జీలు. అది కూడా చేయలేకపోతాడు. దీనికి సింపుల్ గా రెడ్ ఫ్లాగ్ ఇచ్చి అతన్ని అక్కడి నుండి పంపేయొచ్చు. కానీ యాంకర్ శ్రీముఖి తో పాటు , జడ్జీలు ఇతన్ని తీవ్రంగా అవమానించారు. ముఖ్యంగా శ్రీముఖి అయితే చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపించింది.
జడ్జీలను తొందరగా ఇతనికి రెడ్ ఫ్లాగ్ ఇచ్చి పంపేయండి అనడం, ఎందుకు నాకు రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నారో కారణం చెప్పండి అంటే , నువ్వు మాకు చాలా బోరింగ్ గా కనిపిస్తున్నావు అని అనడం, ఒక జడ్జి రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే , నాకు చాలా సంతోషం గా ఉంది అంటూ శ్రీముఖి అతన్ని వెక్కిరించడం వంటివి జరిగాయి. ఆ తర్వాత ఇతను అభిజిత్ తో జరిపిన సంభాషణ లో , అభిజిత్ కంట్రోల్ తప్పిపోయాడు. ఇవన్నీ ఆడియన్స్ కి నచ్చలేదు. అయితే ఇతనికి రోస్టింగ్ చేయడం డ్యూటీ కదా, జడ్జీలు కూడా రోస్టింగ్ పద్దతిలోనే ఇతనికి సమాధానం ఇచ్చారని అనుకోవచ్చు కదా అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే , సుమ అనే కంటెస్టెంట్ జడ్జీల దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం , హగ్ చేసుకోవడం వంటివి చేస్తుంది. అభిజిత్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకి వెళ్తే , అతను షేక్ హ్యాండ్ ఇవ్వకుండా , నమస్కారం పెడుతాడు, ఇది కూడా ఆడియన్స్ కి నచ్చలేదు. దీనిపైనా కూడా ట్రోలింగ్ జరుగుతోంది. మరి వీటికి రాబోయే రోజుల్లో అయినా జడ్జీలు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.