Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 'ది ప్యారడైజ్' అందరినీ అలరిస్తుందనే నమ్మకం లేదంటూ నాని హాట్...

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ అందరినీ అలరిస్తుందనే నమ్మకం లేదంటూ నాని హాట్ కామెంట్స్!

The Paradise Movie: సోషల్ మీడియా లో ఇపుడు ఎక్కడ చూసినా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మేనియా నే కనిపిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ని కూడా భారీ రేంజ్ లో ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాకు ఏ రేంజ్ హైప్ ఉంటుందో , […]

The Paradise Movie: సోషల్ మీడియా లో ఇపుడు ఎక్కడ చూసినా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మేనియా నే కనిపిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ని కూడా భారీ రేంజ్ లో ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాకు ఏ రేంజ్ హైప్ ఉంటుందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ హైప్ ఉంది. ఆ హైప్ కి తగ్గట్టుగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లోనే జరిగాయి. నార్త్ అమెరికా ఈ చిత్రం వారం రోజుల ముందే 4 లక్షల డాలర్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా గ్రాండ్ గా మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగా నాని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉండదు. మా ప్యారడైజ్ చిత్రం కూడా అలాంటిదే. కేవలం జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది’ అంటూ చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాని అభిమానుల్లో సరికొత్త టెన్షన్ ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన ‘టాక్సిక్’ చిత్రాన్ని కూడా ఇదే తరహా లో ప్రమోట్ చేసి విడుదల చేశారు. కానీ ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్యారడైజ్ కి కూడా అలాంటి ఫలితం వస్తే పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈమధ్య కాలం లో థియేట్రికల్ ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్స్ లోకి విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే కావొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని , ఇలాంటి సమయం లో ట్రైలర్ కి ప్రత్యేకంగా సమయం కేటాయించలేమని , అందుకే ట్రైలర్ ని విడుదల చేయడం లేదని చెప్పుకొచ్చారు మేకర్స్. అంతే కాకుండా , ఈ సినిమాలో ఇంట్రడక్షన్ , ఇంటర్వెల్ , క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోతాయని అంటున్నారు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ సాధిస్తుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper