Homeఎంటర్టైన్మెంట్Tollywood Directors: ఈ స్టార్ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి...సక్సెస్ లు ఎప్పుడు కొడతారు...

Tollywood Directors: ఈ స్టార్ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి…సక్సెస్ లు ఎప్పుడు కొడతారు…

Tollywood Directors: ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకి మార్కెట్ కూడా విపరీతంగా ఉంటుంది. ప్రేక్షకులు సైతం వాళ్ల సినిమాలను థియేటర్ కి వచ్చి చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు ఇంతకు ముందు స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికే వాళ్లకు సరైన గుర్తింపు రావడం లేదు. ఈ కారణంతో వాళ్లను ప్రేక్షకులు సైతం […]

Tollywood Directors: ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకి మార్కెట్ కూడా విపరీతంగా ఉంటుంది. ప్రేక్షకులు సైతం వాళ్ల సినిమాలను థియేటర్ కి వచ్చి చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు ఇంతకు ముందు స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికే వాళ్లకు సరైన గుర్తింపు రావడం లేదు. ఈ కారణంతో వాళ్లను ప్రేక్షకులు సైతం తీసి పక్కన పెడుతున్నారు. ఇక వాళ్ళు మరోసారి లైమ్ లైట్ లోకి రావాలన్న వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోవాలన్న కూడా భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. దీనికోసం డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని మంచి కథలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సూపర్ సక్సెస్ లను సాధిస్తారు. లేకపోతే మాత్రం మరింత డీలాపడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఈ క్రమంలోనే హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కెరియర్ మొదట్లో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నప్పటికి ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. వరుసగా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నిరాశపర్చడంతో అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు.

ఇక బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు సైతం కెరియర్ మొదట్లో మాస్ సినిమాలతో చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు వరుసగా స్కంద, అఖండ 2 సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకోవడంతో అతనితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు సైతం ఆసక్తి చూపించడం లేదు. అంటే ఆయన ఎంతలా డీలా పడిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు…

పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చాలావరకు డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే ఆయన ఇండస్ట్రీలో తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్తాడు.

లేకపోతే మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపించకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్ళతో పాటు మరికొంతమంది దర్శకులు సైతం సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి మరోసారి స్టార్ డమ్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper