Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli : శ్రీను, రాజమౌళి ప్రేమించిన అమ్మాయి గురించి తెలియని షాకింగ్ మేటర్స్... ఆమె...

SS Rajamouli : శ్రీను, రాజమౌళి ప్రేమించిన అమ్మాయి గురించి తెలియని షాకింగ్ మేటర్స్… ఆమె మొదటి భర్త ఎవరు?

SS Rajamouli  : దర్శకధీరుడు రాజమౌళి గతంలో ఎన్నడూ ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొనలేదు.శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళిపై వ్యక్తిగత ఆరోపణలు చేశాడు. రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వీడియోలో వెల్లడించాడు. ఒకప్పటి తమ ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే ఇందుకు కారణం అంటూ వీడియో సెల్ఫీ విడుదల చేశాడు.

శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. నేను, రాజమౌళి 34 ఏళ్లుగా మిత్రులం. రమను మేమిద్దరం ప్రేమించాము. మాది ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఇది శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. రాజమౌళి తన కోసం త్యాగం చేయమని అడిగాడు. ముగ్గురం కలిసి ఉందాం అంటే, అలా చేయడం బాగోదు అన్నాడు. రాజమౌళి కోసం నేను రమను వదిలేశాను. నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళికి నేను ఈ విషయాలు ఎక్కడ బయటకు చెప్పేస్తానో అనే భయం ఏర్పడింది. అప్పటి నుండి నన్ను టార్చర్ చేస్తున్నాడు.

Also Read : ఆ ఒక్కటి రాజమౌళి ఒక్కడికే ఎందుకు సాధ్యం అవుతుంది… మిగతా దర్శకులు ఎందుకు చేయలేకపోతున్నారు..

రాజమౌళి టార్చర్ భరించలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియోను సుమోటోగా తీసుకుని రాజమౌళికి లైడిటెక్టర్ టెస్ట్ చేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నేను పాపులారిటీ కోసం ఇదంతా చేయడం లేదంటూ, అన్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న డైరెక్టర్ పై శ్రీనివాసరావు ఆ తరహా ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది.

రాజమౌళి భార్య రమను తాను కూడా ప్రేమించినట్లు శ్రీనివాసరావు చెబుతున్నాడు. రమ ఆయన్ని ఇష్టపడిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కాగా రమ నేపథ్యం పరిశీలిస్తే.. రాజమౌళి కజిన్ కీరవాణి భార్య శ్రీవల్లికి రమ చెల్లులు అవుతుంది. రాజమౌళి కంటే ముందే ఆమెకు వివాహమైంది. ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరే కార్తికేయ. ఇతడు రాజమౌళి సినిమాలకు పని చేస్తూ ఉంటాడు. మనస్పర్థలతో రమ మొదటి భర్తతో విడిపోయింది. అప్పుడు రెండో వివాహంగా రాజమౌళిని చేసుకుంది.

మొదటి భర్త సంతానం కార్తికేయ రాజమౌళి వద్దే పెరిగాడు. రమ-రాజమౌళి అనంతరం ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరు మయూఖ . రాజమౌళి బంధువుగా రమకు ఆయనతో పెళ్లి కి ముందు నుండే పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజమౌళి లవ్ ప్రపోజ్ చేస్తే.. ఒప్పుకున్నానని రమ గతంలో వెల్లడించారు. మరి శ్రీనివాసరావుని కూడా ఆమె ప్రేమించారా? అనేది తెలియదు.

 

RELATED ARTICLES

Most Popular