AP Budget 2025 : ఏపీ ప్రజలకు( Andhra Pradesh peoples) గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనుంది. 25 లక్షల రూపాయలకు సంబంధించి ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన వివిధ రంగాలకు చేసిన కేటాయింపులపై మాట్లాడుతూ బీమా పథకం పై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రజలకు నామమాత్రపు ప్రీమియంతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీస ప్రీమియంతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
* ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ( NTR trust)ద్వారా ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. అయితే దానిని ఐదు లక్షల రూపాయలకు కుదించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆరోగ్య బీమా ద్వారా 25 లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం. ఏపీ బడ్జెట్లో ఆరోగ్య శాఖకు ఏకంగా రూ.19264 కోట్లు కేటాయించారు. ప్రధానంగా పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Also Read : పవన్, లోకేష్ లకు అగ్ర తాంబూలం.. ఏపీ బడ్జెట్లో భారీ కేటాయింపులు!
* వాటికి సడలింపులు
కొత్త బీమా విధానంలో( new insurance policy ) వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని అందించనున్నారు. ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా కొనసాగుతున్నాయి. ఏడాదికి రెండున్నర లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు. దానికి మించి చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. దీనిని హైబ్రిడ్ విధానంగా చెబుతున్నారు.
* త్వరితగతిన అనుమతులు
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు అనుమతి లభించడానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. అదే బీమా విధానంలో అయితే సంబంధిత సంస్థ ఆరు గంటల్లోగా చికిత్స ప్రారంభించడానికి అనుమతి ఇవ్వనుంది. ఒకవేళ చికిత్స కు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే ఆపిల్ చేసుకోవచ్చు కూడా. ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండేలా నిబంధనలు ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీకి మూడేళ్ల పాటు ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లించుతుంది. పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై చాలాసార్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే హామీ నెరవేరుతోంది
Also Read : ఇక ఏపీకి అప్పు పుట్టదా? అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి సంచలనం!