Varanasi Movie: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం గురించి సోషల్ మీడియా లో రోజుకో అప్డేట్ లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్నాయి. లీకైన ప్రతీ అప్డేట్ సినిమా పై హైప్ భారీగా పెంచుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫారిన్ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఐమాక్స్ కెమెరా తో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే , రాజమౌళి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక బాషని కనిపెట్టాడట.
ఎలా అయితే ‘బాహుబలి’ లో కిలికి అనే ఫిక్షనల్ బాషని క్రియేట్ చేశాడో , అలా ఈ సినిమాలో కూడా ఒక బాషని క్రియేట్ చేశాడు అన్నమాట. ఈ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ టైం ట్రావెల్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు ఒక మిస్టీరియస్ గుహలోకి అడుగుపెడుతాడట. ఆ గుహ గోడలపై విచిత్రమైన భాషతో కొన్ని మంత్రాలు రాసి ఉంటారట. వాటిని ఛేదిస్తే కొన్ని మిస్టరీలు అన్ లాక్ అవుతాయని అంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు థియేటర్స్ లో మంచి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందట. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయని. మంచి ఐమాక్స్ స్క్రీన్ లో ఈ సన్నివేశాన్ని చూస్తే , గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు.
బాహుబలి లో కిలికి బాషా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ బాషాని ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేదు. సినిమాల్లో దానిపై కొన్ని వందల పేరడీలు వచ్చాయి. ఇప్పుడు ‘వారణాసి’ లో రాజమౌళి క్రియేట్ చేసిన కొత్త భాషకి అంతకు మించిన రీచ్ వస్తుందని అంటున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే , దాదాపుగా 90 శాతం వరకు పూర్తి అయ్యింది. మహేష్ బాబు కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. దీంతో ఆయన వారణాసి గెటప్ నుండి బయటకు వచ్చేసాడు. ఆయన లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఇక కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట. ఈ నెలలోనే అది కూడా పూర్తి చేసి , డిసెంబర్ నాటికి VFX వర్క్ తో సహా మొదటి కాపీ ని రెడీ చేసే పనిలో పడ్డాడట రాజమౌళి. ముందు చెప్పినట్టుగానే ఏప్రిల్ 7 న ఈ సినిమా విడుదల కాబోతుంది.