Homeఎంటర్టైన్మెంట్Dont Trouble The Trouble: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి కొడుకు సినిమా.. ఎందులో...

Dont Trouble The Trouble: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి కొడుకు సినిమా.. ఎందులో చూడాలంటే!

Dont Trouble The Trouble:  పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో బాగా ఆడిన సినిమాలు కొన్ని , ఓటీటీ లో మాత్రం మిశ్రమ స్పందన ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఈమధ్య కాలం లో కూడా చాలానే వచ్చాయి. ఓటీటీ లో ఆ సినిమాలను చూసిన తర్వాత , బాగానే ఉందే , ఎందుకు ఇలాంటి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది అని అనుకుంటూ ఉంటాము. అలాంటి సినిమాల జాబితాలోకి రీసెంట్ […]

Dont Trouble The Trouble:  పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో బాగా ఆడిన సినిమాలు కొన్ని , ఓటీటీ లో మాత్రం మిశ్రమ స్పందన ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఈమధ్య కాలం లో కూడా చాలానే వచ్చాయి. ఓటీటీ లో ఆ సినిమాలను చూసిన తర్వాత , బాగానే ఉందే , ఎందుకు ఇలాంటి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది అని అనుకుంటూ ఉంటాము. అలాంటి సినిమాల జాబితాలోకి రీసెంట్ గా విడుదలైన ఒక సినిమా చేరబోతుందా?.. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో ఈ చిత్రం కనీసం వారం రోజులు కూడా ఆడలేదు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ వచ్చి ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాకు కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాలేదు. వరుస సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న టాలీవుడ్ కి , ఈ సినిమా బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి.మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ హీరో గా నటించిన ఈ సినిమా ఇప్పుడు గ్రాండ్ గా ఓటీటీ లోకి ఇవ్వనుంది. ఈ నెల 30 వ తారీఖున , అంటే నేడు అర్థ రాత్రి 12 గంటల సమయానికి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ, ఓటీటీ ఆడియన్స్ నుండి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.ఎందుకంటే ఓటీటీ ఆడియన్స్ ఇలాంటి ఫాంటసీ తరహా సినిమాలను బాగా ఆదరించిన దాఖలాలు గతం లో చాలానే ఉన్నాయి.మరి విశేల్షకుల అంచనాలను ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper