యూట్యూబ్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిపోతున్న షణ్ముక్, మరో సోషల్ మీడియా బ్యూటీ ‘దీప్తి సునయన’తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడని ఇప్పటికే అనేక రకాలుగా రూమర్స్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పుకార్లు నిజమే అని రుజువు చేస్తోంది వీరి పర్సనల్ ఫోటో ఒకటి. బెడ్ రూమ్ లో అదీ ఒకే బెడ్ పై ఇద్దరూ కనిపించడంతో ఈ పిక్ బాగా వైరల్ అవుతుంది.
షణ్ముక్ పక్కన దుప్పటి కప్పుకుని ‘దీప్తి సునయన’ పడుకున్న విధానం చూస్తుంటే వీరి మధ్య ఏ స్థాయి రిలేషన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీప్తి సునయనతో కలిసి చాల వీడియోల్లో కలిసి నటించిన షణ్ముఖ్, చాల కాలంగా దీప్తితో రిలేషన్ ఉన్నాడనే వార్త ఆ మధ్య బాగా హల్ చల్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోతో ఆ వార్త పై క్లారిటీ వచ్చింది. వీళ్ళ రిలేషన్ చూస్తుంటే నిజంగానే రిలేషన్ షిప్‌లో ఉన్నారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇక వీరిద్దరు రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి చెబుతూ.. తాము ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అంటూ చెప్పుకొచ్చారు. పైగా వీళ్ళ చేతుల పై ఒకే తరహా టాటూస్ ఉండటం కూడా వీళ్ల బంధాన్ని బలపర్చింది. దీనికితోడు వీరిద్దరి రిలేషన్ గురించి వీరితో కలిసి నటించే ఓ వెబ్ సిరీస్ నటుడు సూర్య స్వామి ఓ ఇంటర్వ్యూలో క్లుప్తంగా చెప్పుకొచ్చాడు.
యాంకర్ దీప్తి, షణ్ముఖ్ ల ప్రేమ గురించి, అలాగే వారి పెళ్లి గురించి అడిగితే, నటుడు సూర్య స్వామి వారి బంధం గురించి చెబుతూ ‘ అందులో తప్పేముంది. వారి ప్రేమ వారిష్టం. వారిద్దరూ మరో రెండేళ్లలో పెళ్లి కూడా చేసుకోవచ్చు, వాళ్ళ మధ్య అంత అండర్ స్టాడింగ్ ఉంది’ అంటూ ఈ సోషల్ మీడియా జంట రిలేషన్ గురించి స్పష్టంగా చెప్పేశాడు. దానికి తోడు ఇప్పుడు ఈ ఫోటో కూడా వీరి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Shanmukh with deepti sunayana personal photo leaked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com