
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎంత రిస్క్ అయినా ఒప్పేసుకుంటారు. పైగా హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఏ హీరోయిన్ ఎక్కువగా ఆలోచించదు. వెంటనే డేట్స్ ఇచ్చేస్తోంది, ఒక్క కీర్తి సురేష్ తప్ప. మహేష్ సినిమాలో కీర్తి నటిస్తోందని వార్తలు బయటకు పొక్కగానే మహేష్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మహానటిలో కీర్తి నటన అంత బాగా నచ్చింది అందరికీ.
అందుకే మహేష్ సినిమాలో కీర్తి పేరు బయటకు రావడం మహేష్ ఫ్యాన్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చకచకా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులతో షూటింగ్ చేసే పరిస్థితి లేదు. కానీ, ఈ నెల లాస్ట్ వీక్ నుండి ఎలాగైనా సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేశాడు. దాంతో మేకర్స్ కీర్తి సురేష్ ను కూడా షూటింగ్ కోసం సంప్రదించారు, కానీ ఆమె నో చెప్పేసింది.
దీంతో మహేష్ ఆమె పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి కరోనా భయమే గాని కీర్తి సురేష్ లో ఉంటే, మరి రజినీకాంత్ సినిమా కోసం ఎందుకు ప్రస్తుతం కూడా డేట్స్ ఇచ్చింది ? అదే మహేష్ సినిమాకైతే డేట్స్ ఇవ్వదా ? అనేది సర్కారు టీమ్ ఆలోచన. ఇదిలా వుంటే కీర్తి సురేష్ పై, సర్కారు నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించే నమ్రత ఈ విషయం పై సీరియస్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కీలకమైన సన్నివేశాల షూట్ కోసం హీరోతో పాటు మిగిలిన కీలక నటులు కూడా డేట్స్ ఇస్తున్నప్పుడు, ఆమె ఎందుకు ఇవ్వదు ? అని సర్కారు యూనిట్ దగ్గర నమ్రత కోపం వ్యక్తం చేసిందట. ఇదిలా వుంటే చిత్రంగా కీర్తి సురేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆమె రజినీకాంత్ సినిమా కోసం ఆల్ రెడీ ఈ నెల మొత్తం డేట్స్ ఇచ్చింది. సో.. తనకు రజిని సినిమా కూడా ముఖ్యమే కదా అనేది కీర్తి వెర్షన్.