`హ్యాపీడేస్`, `కొత్త బంగారు లోకం` అంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే మంచి హిట్స్ ను అందుకున్నాడు వరుణ్ సందేశ్. కెరీర్ బిగినెంగ్ లోనే మంచి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, ఆ తర్వాత కూడా `ఏమైంది ఈ వేళా` లాంటి మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే హీరోగా చాల గ్యాప్ ఇచ్చిన ఈ హీరో, కొత్తగా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
`ఇందువదన` అనే టైటిల్ తో ప్రస్తతం వరుణ్ సందేశ్ సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. క్లాసిక్ లుక్ లో బోల్డ్ స్టిల్ ఇస్తూ కనిపిస్తోన్న హీరోహీరోయిన్లు మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నారు. మొత్తమ్మీద ఈ చిత్ర ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఊహించని విధంగా ఉండటంతో పాటు సినిమా పై ఆసక్తిని పెంచింది ఈ లుక్.
ఇక ఈ ఫస్ట్ లుక్ ను బట్టి ఇదొక రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తోంది. మొత్తానికి వరుణ్ సందేశ్ నుండి ఇంట్రస్టింగ్ సినిమా వచ్చేలా ఉంది. ఇక ఈ సినిమాకి నూతన దర్శకుడు ‘ఎంఎస్‌ఆర్’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా బాగుంది అని తెలుస్తోంది. శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. టైటిలే ఆసక్తిగా ఉండటంతో సినిమా పై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Induvadana 1st look varun sandesh in bold look
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com