Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా...ఎలా మిస్సయ్యింది...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం రేంజ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమాని సైతం షేక్ చేయగలిగే క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం […]

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం రేంజ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమాని సైతం షేక్ చేయగలిగే క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. క, కే ర్యాంప్ సినిమాలతో సక్సెస్ ని సాధించిన ఆయన ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే భారీ లెవెల్లో చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కథ సైతం మొదట కిరణ్ అబ్బవరం దగ్గరికి వచ్చిందట. కానీ ఆ మూవీ బడ్జెట్ పెరుగుతుండటం వల్ల తనకున్న మార్కెట్ కు అ బడ్జెట్ కి సెటవ్వదనే ఉద్దేశ్యంతో సాయిధరమ్ తేజ్ ను ఆ సినిమాలో భాగం చేసినట్టుగా తెలుస్తుంది.

కిరణ్ అబ్బవరం ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు అయిన రోహిత్ తన దగ్గరికి ఒక చిన్న కథ తీసుకొని వచ్చాడని కాకపోతే ప్రస్తుతం చిన్న కథ వద్దని ఒక మంచి పెద్ద కథనే చేసుకొని రమ్మని కిరణ్ అబ్బవరం చెప్పారట. దాంతో మంచి కథ రెడీ చేసిన రోహిత్ ప్రొడ్యూసర్ నిరంజన్ ను కలిశాడు. దాంతో నిరంజన్, రోహిత్ కిరణ్ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు.

కానీ బడ్జెట్ మాత్రం 780 కోట్ల వరకు వెళ్తుండడంతో దీనికి ఒక స్టార్ హీరో అయితే బాగుంటాడని కిరణ్ అబ్బవరం చెప్పారట. దాంతో కిరణ్ తనంతట తనే తప్పుకొని సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలోకి వచ్చే విధంగా ప్రణాళికలో రూపొందించాడు. మొత్తానికైతే సంబరాల ఏటి గట్టు సినిమా కూడా సక్సెస్ ని సాధిస్తే హ్యాపీగా ఉంటానని చెప్పాడు.

అలాగే లెనిన్ సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందని అఖిల్ బ్రో సైతం మంచి హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ ఇలా సక్సెస్ లను సాధిస్తే బాగుండాలని తను పర్సనల్ గా చాలా హ్యాపీ గా ఉంటానని చెప్పాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper