spot_img
Homeఎంటర్టైన్మెంట్Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్ కళ్యాణ్..

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి బంధువు కాబట్టి , మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. అంతే కాకుండా వైసీపీ పార్టీ నుండి కూడా కొంతమంది ముఖ్య నేతలు ఈ పెళ్లి హాజరయ్యారు. అంగరంగంగా వైభవం గా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి , ఇప్పటికీ అవి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇలా శుభ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకే మెహర్ కుటుంబం లో తీవ్రమైన విషాదం నెలకొంది. గత కొంతకాలం గా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మెహర్ రమేష్ సోదరి నేడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.

ఈ విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నేరుగా హాస్పిటల్ కి వెళ్లి మెహర్ రమేష్ ని , ఆయన కుటంబాన్ని పరామర్శించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మెహర్ రమేష్ కుటుంబం లో జరిగిన ఈ సంఘటనకు ఆయన చలించిపోయారు. ప్రయాణం చెయ్యలేని పరిస్థితి లో ఉన్నప్పటికీ , ఆయన హాస్పిటల్ కి పరుగులు తీశారు. దీనిని బట్టీ మెహర్ కుటుంబం పవన్ కళ్యాణ్ కి ఎంత దగ్గరైన వాళ్ళో అర్థం అవుతోంది. మరోపక్క మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఇతర హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళు కూడా మెహర్ రమేష్ ని ఓదార్చే వీడియోలు బయటకు రావొచ్చు.

ఇక మెహర్ రమేష్ కెరీర్ విషయానికి వస్తే, కంత్రి చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ‘భోళా శంకర్’ వరకు సాగింది. ఆయన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో కేవలం ‘బిల్లా’ ఒక్కటే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ వంటి సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం దర్శకత్వానికి దూరం గా ఉన్న మెహర్ రమేష్ , ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అంతే కాదు , త్వరలోనే ఆయన నటుడిగా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
National Flag Day

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Oktelugu Epaper