BenQ iScreenBar : ప్రముఖ టెక్ బ్రాండ్ BenQ InfoComm 2026లో తన కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. ముంబైలో జరిగిన ఈ టెక్ ఈవెంట్‌లో వర్క్‌స్పేస్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చే రెండు కొత్త డెస్క్ లైటింగ్ సిస్టమ్స్‌ను కంపెనీ ప్రదర్శించింది. వీటిలో iScreenBar, iScreenBar Max ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ రెండు ఉత్పత్తులను అంతకుముందు బెర్లిన్‌లో జరిగిన IFA 2026లో కూడా పరిచయం చేశారు.
చిన్న డిస్‌ప్లేలు, ముఖ్యంగా Apple iMac వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని iScreenBarను రూపొందించారు. ఇది మానిటర్ వెనుక భాగానికి మ్యాగ్నెటిక్‌గా అమర్చుకునేలా ఉంటుంది. అంతేకాకుండా iMacలోని మైక్రోఫోన్‌కు అనువుగా ప్రత్యేక క్యావిటీని కూడా ఇందులో అందించారు. తక్కువ వెలుతురులో పనిచేసేటప్పుడు, ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చునే సమయంలో కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.
iScreenBarలో iMac డిస్‌ప్లేకు అనుగుణంగా ప్రత్యేక లైటింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీడియో కాల్స్ సమయంలో లైట్ బార్‌లోని కొంత భాగాన్ని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసే ప్రత్యేక మోడ్ కూడా ఉంది. గత తరం ఉత్పత్తులతో పోలిస్తే ఇందులో కంట్రోల్స్‌ను లైట్ బార్‌లోనే ఇంటిగ్రేట్ చేశారు.
ఇక ScreenBar Max విషయానికి వస్తే.. ఇది డ్యూయల్-మానిటర్ సెటప్‌ల కోసం రూపొందించిన పెద్ద డెస్క్ లైటింగ్ సిస్టమ్. సాధారణ ScreenBar ఉత్పత్తులతో పోలిస్తే ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇందులో డిస్‌ప్లే, కంట్రోల్స్‌ను లైట్ బార్‌లోనే సమగ్రంగా అందించారు. ప్రత్యేక మౌంటింగ్ సిస్టమ్ ఉండటంతో దీనిని నేరుగా మానిటర్‌కు అమర్చాల్సిన అవసరం లేదు.
Apple యూజర్ల కోసం INFTYLAB
BenQకు చెందిన INFTYLAB బ్రాండ్ కూడా మూడు యాక్సెసరీలను ప్రదర్శించింది. ఇందులో Studio Arm, M Mouse వంటి ఉత్పత్తులు ఉన్నాయి. Studio Armను Apple Studio Display, Studio Display XDR, iMac కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది కేబుల్స్ కనిపించకుండా క్లీనర్ డెస్క్ సెటప్‌ను అందించడంతో పాటు, డిస్‌ప్లేను వివిధ కోణాల్లో తిప్పుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది. VESA, Stand మోడళ్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
INFTYLAB M Mouse తేలికైన, ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించిన ప్రొడక్టివిటీ మౌస్. ఇందులో రెండు స్క్రోల్ వీల్స్, మూడు కస్టమైజ్ చేసుకునే బటన్లు ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా మూడు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకుని అవసరానికి అనుగుణంగా వాటి మధ్య మారవచ్చు. Glide డెస్క్‌టాప్ యాప్ ద్వారా మౌస్ సెట్టింగ్స్, బటన్లను కస్టమైజ్ చేసుకోవచ్చు.
అయితే InfoComm 2026లో ప్రదర్శించిన ఈ కొత్త ఉత్పత్తులు ప్రస్తుతం భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాలేదు. వీటి ధరలు, ఇండియాలో అందుబాటులోకి వచ్చే తేదీని BenQ తరువాత వెల్లడించనుంది.