
Samantha Ruth Prabhu Nude Look : ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు లాగా మారిపోయింది సమంత. ఒకప్పుడు కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ,ఇప్పుడు కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తుంది.కథ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి కూడా ఈమె ఏమాత్రం వెనకాడడం లేదు.గతంలో ఆమె అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయినా ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.
ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్’ ని ఇండియన్ వెర్షన్ తీస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నాడు.ఈమధ్యనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ఇందులో సమంత కి బోలెడన్ని యాక్షన్ ఫైట్ సన్నివేశాలు ఉంటాయి, ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్రని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసింది.ఇందులో ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయింది.బెడ్ రూమ్ లో హీరోతో కలిసి న్యూడ్ లుక్ తో కనిపించిన షాట్ ని రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో మనం గమనించొచ్చు.
ఇక్కడ కూడా సమంత అలా న్యూడ్ లుక్ లో కనిపించబోతుందట, ఇది ఇక్కడి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం మొదలైంది మేకర్స్ లో.అయితే సమంత మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.కథకి కీలకంగా వచ్చే సన్నివేశం కాబట్టి తనకి ఏమాత్రం ఇబ్బంది లేదని, నేను సిద్దమే అంటూ చెప్పిందట.మరి ఆమె ఇలాంటి సన్నివేశం లో కనిపిస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.