Samantha Ruth Prabhu: సౌత్ లో ప్రస్తుతం క్రేజ్ పరంగా , స్టార్ డమ్ పరంగా సమంత మించిన హీరోయిన్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ టక్కుమని నయనతార , అనుష్క పేర్లు గుర్తుకువస్తాయి. ఎందుకంటే వాళ్ళు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నారు. సమంత కి కూడా సూపర్ హిట్స్ ఉన్నాయి , కానీ మొట్టమొదటిసారి సౌత్ ఇండియా లో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఘనత సమంత కి మాత్రమే దక్కింది. ఆమె హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి. అయితే సమంత కి ప్రస్తుతం దరిదాపుల్లో ఒక్క సౌత్ హీరోయిన్ గా లేదని రీసెంట్ గా మరోసారి అధికారికంగా తేలింది. ఆ విశేషాలేంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్’ ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అత్యంత ప్రజాధారణ పొందిన హీరోయిన్స్ జాబితా ని విడుదల చేసింది. ఈ జాబితాలో సమంత నెంబర్ 1 స్థానం లో నిలబడగా, నేషనల్ క్రష్ గా పిలవబడే రష్మిక నాల్గవ స్థానంలో నిల్చింది. అదే విధంగా కాజల్ అగర్వాల్ 6 వ స్థానంలో నిలబడగా , 9 వ స్థానం లో త్రిష నిల్చింది. ఇక సాయి పల్లవి , నయనతార ర్యాంకులు అయితే ఇంతకు ముందుతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఓవరాల్ గా సౌత్ లో సమంత కి పోటీ ఇచ్చే హీరోయిన్స్ ఎవ్వరూ లేరని మరోసారి తేలిపోయింది. ప్రతీ ఏడాది ‘ఆర్మాక్స్’ విడుదల చేసే జాబితాలో టాప్ లో ఉంటూ వచ్చిన సమంత , ఈ ఏడాది కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషం. సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ తో పాటు , రీసెంట్ గానే ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ తో సమంత క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లిందని, అందుకే మరోసారి ఆమె టాప్ లో నిలిచిందని అంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం సమంత మెటర్నిటీ లీవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా ,కొంతకాలం ఆమె షూటింగ్స్ కి దూరం గా ఉండాలని నిర్ణయించుకుంది. ఒకపక్క నిర్మాతగా , మరోపక్క హీరోయిన్ గా వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తున్న సమంత ని మళ్లీ వెండితెర పై చూడాలంటే కొన్నేళ్లు ఆగక తప్పదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఆమె నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.