Homeఎంటర్టైన్మెంట్Samantha Ruth Prabhu: ఘనంగా జరిగిన సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Samantha Ruth Prabhu: ఘనంగా జరిగిన సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Samantha Ruth Prabhu: ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్యాటగిరీలో సౌత్ ఇండియా లోనే మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన హీరోయిన్ గా చరిత్ర తిరగరాసిన సమంత, ప్రస్తుతం గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. గర్భం తోనే ఈమె షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నది , యాక్షన్ సన్నివేశాలు కూడా అదే గర్భం తో చేసింది. ఇప్పటికీ కూడా గర్భం తోనే వర్కౌట్స్ చేయడం వంటివి చేస్తూ అందరినీ […]

Samantha Ruth Prabhu: ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్యాటగిరీలో సౌత్ ఇండియా లోనే మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన హీరోయిన్ గా చరిత్ర తిరగరాసిన సమంత, ప్రస్తుతం గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. గర్భం తోనే ఈమె షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నది , యాక్షన్ సన్నివేశాలు కూడా అదే గర్భం తో చేసింది. ఇప్పటికీ కూడా గర్భం తోనే వర్కౌట్స్ చేయడం వంటివి చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తోంది సమంత. ఇప్పుడు ఆమె రీసెంట్ గా సీమంతం చేసుకోవడం , అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం వంటివి హాట్ టాపిక్ గా మారింది. సమంత వాస్తవానికి ఒక క్రిస్టియన్. అయినప్పటికీ కూడా ఆమె హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండ అనుసరించడం ప్రశంసనీయం.

‘మయోసిటిస్’ వంటి ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడి , నేడు ఈ రేంజ్ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు ముఖ్య కారణం , ఆమె నమ్మిన దేవుడే అట. అందుకే ఆమె నిత్యం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది , ఆమె రెండవ పెళ్లి కూడా హిందూ సంప్రదాయాలతోనే చేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె తన సీమంతానికి సంబంధించిన ఫోటోలు , వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు మన సంప్రదాయాలపై అపారమైన భక్తి గౌరవం ఉంది. నాకు మన సంప్రదాయాల్లో ఉన్న గొప్పదనం గురించి పూర్తి స్థాయి అవగాహన లేకపోవచ్చు. కానీ వాటిలో ఉన్న మహత్యలను గట్టిగా నమ్ముతాను. వేదమంత్రాల్లో ఉన్న శక్తి ని గమనించినప్పుడల్లా , ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. మన సంప్రదాయాలను ఈ స్థాయిలో గౌరవించడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. సమంత సీమంతం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ఇకపోతే కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలి , కూతురు పుడితే ఎలాంటి పేరు పెట్టాలి అనే విషయం పైన కూడా సమంత , రాజ్ నిడిమోరు దంపతులు బలమైన నిర్ణయం తీసేసుకున్నారు అట. ఇకపోతే సమంత కొన్నాళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం తన బిడ్డ పైనే పెట్టనుంది సమంత.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper