HomeజాతీయంRajasthan: మామ నుంచి మరిది దాకా.. ఇంటి కోడలి తో చాటు సంసారం..ఇదెక్కడి పిచ్చి ఆచారం

Rajasthan: మామ నుంచి మరిది దాకా.. ఇంటి కోడలి తో చాటు సంసారం..ఇదెక్కడి పిచ్చి ఆచారం

Rajasthan: మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ఆచారాల వినడానికి వింతగా ఉంటాయి. మరికొన్ని విచిత్రంగా కనిపిస్తాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కనిపించే నాతా ప్రథా(Nata Pratha), చూరా ప్రథా (chura pratha) గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదనే భావనతో కొన్ని సమాజాల్లో మహిళలు మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పించే సాంప్రదాయాలు […]

Rajasthan: మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ఆచారాల వినడానికి వింతగా ఉంటాయి. మరికొన్ని విచిత్రంగా కనిపిస్తాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కనిపించే నాతా ప్రథా(Nata Pratha), చూరా ప్రథా (chura pratha) గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది.

భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదనే భావనతో కొన్ని సమాజాల్లో మహిళలు మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు అవకాశం కల్పించే సాంప్రదాయాలు అనేకం ఉన్నాయి. వీటిని అందరూ తప్పుగా అర్థం చేసుకొని.. మామ నుంచి మరిది వరకు అందరితో సంబంధాలు పెట్టుకునే ఆచారంలాగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీటి వెనుక ఉన్న కథ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నాతా ప్రథా.. మరో వ్యక్తితో కొత్త జీవితం

రాజస్థాన్ రాష్ట్రంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో భర్త మరణించిన మహిళను ఆమె మరిది (దేవర్), కొన్నిచోట్ల భర్త అన్న ( జే ట్) జంటగా జీవించే విధంగా కుటుంబాలు.. గ్రామ పెద్దలు నిర్ణయించే సంప్రదాయం ఉంది. దీనినే చూరా ప్రథా అని పిలుస్తుంటారు. కొన్ని సందర్భాలలో నాతా సంప్రదాయంతో అనుసరిస్తారు. అయితే ఇది మామ (భర్త తండ్రి) నుంచి మరిది వరకు అందరితో సంబంధాలు పెట్టుకునే ఆచారం అసలు కాదు. ప్రధానంగా భర్త మరణించిన మహిళకు కుటుంబంలోనే మరో పురుషుడితో వైవాహిక బంధం ఏర్పరిచే విధానం.

చూరా ప్రథా

రాజస్థాన్లోని కొన్ని వ్యవసాయ ఆధారిత గ్రామీణ సమాజాల్లో చూరా ప్రథా అనే విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం భర్త మరణించిన మహిళను అక్కడి తమ్ముడు లేదా అన్నతో జీవించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తారు. మహిళ చేతికి గాజులు తొడగడం ద్వారా కొత్త బంధానికి గుర్తింపు ఇస్తారు.. ఈ బంధంలో ఆ మహిళ.. ఆమెకు గతంలో భర్త ద్వారా కలిగిన పిల్లలు కూడా అదే కుటుంబంలో కొనసాగుతారు. ఈ సాంప్రదాయంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. మరిదికి అప్పటికే భార్య ఉన్నా.. అతడితో వితంతువు వదిన బంధం ఏర్పరచుకుంటుంది. అంటే ఒక పురుషుడికి ఇద్దరు మహిళలతో కుటుంబ సంబంధాలు కొనసాగుతాయి. ఇద్దరికీ పిల్లలు కూడా కలగవచ్చు. ఓకే కుటుంబంలో ముగ్గురు వేరువేరు సంబంధాల ద్వారా పిల్లల పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. 2023లో ది ప్రింట్ పరిశోధనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. రాజస్థాన్లోని జంజన్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబ పరిస్థితులను అందులో వివరించింది. పుల్వామా ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల జీవితాల్లో ఈ సాంప్రదాయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఆ కథనం బయటపెట్టింది.

చూరా ప్రథా తో పాటు నాతా ప్రథా కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ పద్ధతిలో భర్తతో విడిపోయిన మహిళ లేదా భర్త మరణించిన మహిళ మరో వ్యక్తితో కొంత బంధాన్ని ఏర్పరచుకోవచ్చు కొన్ని సమాజాల్లో ఈ బంధానికి సాంప్రదాయమైన గుర్తింపు ఉంటుంది. అయితే ఇందులో ఆర్థిక లావాదేవీలు కూడా భాగంగా ఉంటాయి. కొత్తగా బంధం ఏర్పరచుకునే పురుషుడు మహిళా కుటుంబానికి లేదా గత భర్తకు కొంత మొత్తం చెల్లించే సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భాన్ని స్థానికంగా జమాడ అని పిలుస్తుంటారు.

పూర్వకాలంలో భర్తను కోల్పోయిన మహిళలు అనేక సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పిల్లలను పెంచడం, కుటుంబం పోషించడం.. ఆస్తి హక్కులను కాపాడుకోవడం కష్టంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళకు కుటుంబంలోని మరో పురుషుడు ద్వారా ఆర్థిక, సామాజిక పద్ధతి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి సంప్రదాయాలు ఏర్పడ్డాయి. కాల క్రమంలో కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారాలు మహిళల స్వేచ్ఛకు అడ్డంకి గా మారిపోయాయి. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా బంధాలను ఏర్పరచడం.. ఆస్తులు.. పరిహారం.. పిల్లల భవిష్యత్తు పేరుతో ఒత్తిడి చేయడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ని రకాల వాదనలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper