Home Loan:సొంతింటి కలలు నెరవేర్చుకోడానికి చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. నెల నెల వాయిదా చెల్లించడం ఒక ఎత్తైతే.. ఏళ్ల తరబడి బ్యాంకులకు వడ్డీ రూపంలో లక్షల రూపాయలు చెల్లించడం మరొక ఎత్తు. ఉదాహరణకు 50 లక్షల హోం లోన్ తీసుకుంటే.. 20 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీ మొత్తం కూడా భారీగానే ఉంటుంది. అయితే కొన్ని తెలివైన ఆర్థిక నిర్ణయాలతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. లోన్ తీసుకున్న వారికి ఉపయోగపడే ఈ స్మార్ట్ ఈఎంఐ ట్రిక్స్ తెలుసుకుందాం.
హోమ్ లోన్ తీసుకున్నవారు పాటించాల్సిన ముఖ్యమైన ట్రిక్ ఇది. ప్రతి నెల ఈఎంఐ చెల్లించడంతోపాటు.. సంవత్సరానికి అదనంగా ఒక ఈఎంఐ చెల్లించాలి. ఉదాహరణకు మే నెలవారి ఈఎంఐ 40,000 అనుకుంటే.. ఏడాదికి మరో 40 వేలు అదనంగా చెల్లిస్తే ఆ మొత్తం నేరుగా అసలు రుణం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో అసలు రుణం వేగంగా తగ్గిపోతుంది. భవిష్యత్తు కాలంలో చెల్లించాల్సిన వడ్డీ తగ్గుతుంది. లోన్ కాల పరిమితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
మీ జీతం ప్రతి ఏడాది పెరుగుతుందా.. అయితే ఈ అమ్మాయి కూడా కొంత పెంచుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుత 30,000 ఈఎంఐ చెల్లిస్తుంటే.. వచ్చే ఏడాది దాన్ని 31,500కు పెంచుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ఏడాది 5% చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు. దీనివల్ల రుణం త్వరగా పూర్తవుతుంది. వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఈఎంఐ పెంచుకునే ముందు మీ కుటుంబ ఖర్చులు.. ఇతర ఆర్థిక బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.
బ్యాంకుల వడ్డీ రేట్లు పెంచినప్పుడు చాలామంది ఈఎంఐ పెంచుకోవడానికి బదులుగా లోన్ కాల పరిమితిని పెంచుకుంటారు.. దీనివల్ల నెల వారి భారం తగ్గినప్పటికీ.. మొత్తం చెల్లించే వడ్డీ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ ఆదాయానికి అనుకూలంగా ఉండే ఈఎంఐ ని కొంత పెంచుకోవడం ద్వారా లోన్ కాల పరిమితిని తగ్గించుకోవచ్చు.
బోనస్.. ఇన్సెంటివ్.. ఇతర ఆదాయం వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత హోమ్ లోన్ చెల్లించడానికి ఉపయోగించండి. వార్షిక బోనస్ ఒక లక్ష వచ్చింది. అందులో 50వేలను అత్యవసర అవసరాల కోసం ఉంచండి. మిగిలిన 50 వేలను హోం లోన్ ప్రిన్సిపల్ కు తరలించండి. ఇలా చేయడం వల్ల అసలు రుణం తగ్గుతుంది. ముఖ్యంగా లోన్ ప్రారంభ సంవత్సరంలో పార్ట్ ప్రీ పేమెంట్ చేయడం ఎక్కువగా ప్రయోజనం అందిస్తుంది. అయితే అత్యవసర నిధిని ఖాళీ చేసి రుణాన్ని చెల్లించకూడదు.
మీరు తీసుకున్న బ్యాంకు ప్రస్తుతం అధిక వడ్డీ వసూలు చేస్తుందా.. ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీకి హోమ్ లోన్ అందిస్తున్నాయా.. అయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించాలి. ఉదాహరణకు మీ ప్రస్తుత వడ్డీ రేటు 9% ఉంటే.. మరో బ్యాంకు 8.25 శాతానికి రుణం బదిలీ చేసే అవకాశం ఇవ్వచ్చు. బ్యాంకు మారాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం బకాయి ఎంత ఉంది.. కొత్త బ్యాంకు ఎంత వడ్డీ రేటు కల్పిస్తోంది.. ప్రాసెసింగ్.. ఇతర చార్జీలు ఎలా ఉన్నాయి.. లోన్ కాల పరిమితి ఎంత.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న ఫ్లోటింగ్ రేట్ రుణాలను ముందుగానే చెల్లించినప్పుడు బ్యాంకులు ప్రీపెయిమెంట్ ఛార్జీలు విధించకూడదు. 2026 జనవరి 1 నుంచి మంజూరైన లేదా రెన్యువల్ చేసిన రుణాలకు సంబంధించిన కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. గతంలో మంజూరైన వ్యక్తిగత ఫ్లోటింగ్ రేట్ కూడా ప్రీ పేమెంట్ ఛార్జీలు విధించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఫిక్స్ డ్ రేటు రుణాలకు మాత్రం నిబంధనలు వేరుగా ఉన్నాయి. వడ్డీరెట్లు మారినప్పుడు ఈఎంఐ పెంచుకోవాలా.. కాలపరిమితి పెంచుకోవాలా.. కొంత రుణం ముందుగానే చెల్లించాలా అనే అవకాశాలను బ్యాంకు నుంచి తెలుసుకోవచ్చు.
హోమ్ లోన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ దానిని వీరినంత త్వరగా పూర్తిచేయడం ఆర్థికంగా చాలా మంచిది. ప్రతి ఏడాది చిన్న ముత్తాలను అదనంగా చెల్లించడం.. ఈఎంఐ పెంచుకోవడం.. తక్కువ బడ్డినెట్లను పరిశీలించడం ద్వారా లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.