Homeఎంటర్టైన్మెంట్మరో కొత్త డైరెక్టర్​తో సాయి ధరమ్!

మరో కొత్త డైరెక్టర్​తో సాయి ధరమ్!

స్టార్టింగ్‌లోనే విజయాలు అందుకొని ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌. దాదాపు మూడేళ్లు ఫెయిల్యూర్లో ఉన్నాడతను. అయితే, వరుసగా రెండు హిట్స్‌తో దానికి పుల్‌స్టాప్‌ పెట్టాడు. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ విజయాలతో అతను మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ లోకి వచ్చేశాడు. ఆ జోష్‌లో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ముందుకు రాబోతున్నాడు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. […]

Sai Dharam Tej
స్టార్టింగ్‌లోనే విజయాలు అందుకొని ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌. దాదాపు మూడేళ్లు ఫెయిల్యూర్లో ఉన్నాడతను. అయితే, వరుసగా రెండు హిట్స్‌తో దానికి పుల్‌స్టాప్‌ పెట్టాడు. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ విజయాలతో అతను మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ లోకి వచ్చేశాడు. ఆ జోష్‌లో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ముందుకు రాబోతున్నాడు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్లోనే రిలీజ్‌ చేద్దామనుకున్నా కరోనా కారణంగా లాస్ట్‌ షెడ్యూల్‌ వాయిదా పడడంతో అది సాధ్యం కాలేదు.

Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!

బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. తేజు సరసన నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు దేవ కట్టా దర్శకత్వం వహించే పొలిటికల్ డ్రామా మూవీకి కూడా సాయి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మూవీలో అతను యువ ఐఏఎస్‌ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం పలువురు ప్రభుత్వ అధికారులను దగ్గరి నుంచి గమనిస్తున్న సాయి.. కొంచెం బరువు కూడా తగ్గి స్లిమ్‌గా మారే పని లో ఉన్నాడు. కరోనా ప్రభావం తగ్గి ‘సోలో బ్రతుకే’లో మిగతా పార్ట్‌ పూర్తయిన వెంటనే ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

తాజా సమాచారం మేరకు మెగా మేనల్లుడు మరో మూవీకి కూడా ఓకే చెప్పాడు. మరో కొత్త దర్శకుడితో అతను సినిమా తీయబోతున్నాడని సమాచారం. దీనికి కూడా బీవీఎస్‌ఎన్‌ ప్రసాదే నిర్మాతగా వ్యవహరిస్తాడట. అంతే కాదు బడా ప్రొడ్యూసర్ దిల్‌ రాజు కూడా ఇందులో భాగం అవుతాడని తెలుస్తోంది. దాంతో, బీవీఎస్‌ఎన్‌, దిల్‌ రాజు ఫస్ట్‌ టైమ్‌ ఓ జాయింట్‌ ప్రాజెక్టును చేపట్టనున్నారు. లాక్‌డౌన్‌ బ్రేక్‌లో పలు కథలు విన్న సాయితేజ్‌ను.. ఓ యువ దర్శకుడు ఇంప్రెస్‌ చేశాడట. అయితే, ఆ కొత్త దర్శకుడు ఎవరనే విషయంతో ప్రాజెక్ట్‌ గురించి తొందర్లోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper