Nagabandham Trailer: క్వాలిటీ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నా రోజులివి. హీరో ఎవరైనా కానీ , ప్రేక్షకులకు కావాల్సిన సరైన కంటెంట్ అందిస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలతో సమానమైన కలెక్షన్స్ ని ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. ఇటీవల కాలం లో ఇలాంటి సందర్భాలు హాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చూస్తూ వచ్చాము. మన టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ రీసెంట్ గానే మొదలైంది. అందుకే కొత్త హీరోల మీద కూడా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసం చేస్తున్నారు. అలా తీసిన చిత్రమే ‘నాగ బంధం’. ఈ చిత్రం ద్వారా విరాట్ కర్ణ అనే కొత్త కుర్రాడు హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఈ చిత్రం లో నభ నటేష్ నటించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటంటే , 100 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్స్ ఉన్న మూవీ ని ఎలా తెరకెక్కించారు?, నిజంగా డైరెక్టర్ అభిషేక్ నామా కి దండం పెట్టాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ మిస్టరీ గా ఉన్న నిధి ని ఛేదించడానికి అసురులు ప్రయత్నం చేస్తుంటారు. నిధి కంటే విలువైన బ్రహ్మ కమలం దొరికితే ఈ విశ్వాన్నే శాసించవచ్చు , అది కూడా అనంత పద్మనాభ ఆలయాళం లోనే ఉంటుంది. దాని కోసం అసురులు ప్రయత్నం చేయడం , హీరో దానిని అడ్డుకోవడమే ఈ సినిమా స్టోరీ.
ఇలాంటి ఫాంటసీ జానర్ సినిమాలకు ఇది రొటీన్ స్టోరీ నే , అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని చోట్ల VFX షాట్స్ తేడా కొట్టాయి, ముఖ్యంగా ట్రైలర్ లోని చివరి షాట్ లో , భారీ విష సర్పాలను చూపిస్తారు, అది చూసేందుకు సహజం గా లేదు. ట్రైలర్ మొత్తం మీద ఇదొక్కటే తేడా గా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో కూడా గొప్పగా అనిపించడం లేదు. చూసేందుకు బాగానే ఉన్నాడు కానీ , ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి విడుదలయ్యాక ఈ ఫీలింగ్ ఉంటుందో లేదో చూడాలి.
