Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: ఆ దర్శకుడి కారణంగా తన ప్రేయసితో బ్రేకప్ చేసుకున్న సాయి ధరమ్...

Sai Dharam Tej: ఆ దర్శకుడి కారణంగా తన ప్రేయసితో బ్రేకప్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్..అసలు ఏమైందంటే!

Sai Dharam Tej: 40 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా, ఇప్పటికీ పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలలో ఒకరు సాయి ధరమ్ తేజ్. గతం లో ఈయన ప్రముఖ హీరోయిన్ రెజీనా తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం సాగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వీళ్లిద్దరు పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా, ఆడియన్స్ దానిని నమ్మలేదు. అలా కేవలం […]

Sai Dharam Tej: 40 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా, ఇప్పటికీ పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలలో ఒకరు సాయి ధరమ్ తేజ్. గతం లో ఈయన ప్రముఖ హీరోయిన్ రెజీనా తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం సాగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వీళ్లిద్దరు పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా, ఆడియన్స్ దానిని నమ్మలేదు. అలా కేవలం రెజీనా తో ఆగిపోలేదు, మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో కూడా సాయి ధరమ్ తేజ్ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఒక దర్శకుడి కారణంగా తన లవ్ బ్రేకప్ అయ్యిందని సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా జరిగిన ఒక మూవీ ఈవెంట్ లో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సుహాస్ హీరోగా నటించిన ‘హే భగవాన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆయనతో పాటు ప్రముఖ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కూడా మరో అతిథిగా వచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్, రామ్ లు మొదటి నుండి మంచి స్నేహితులు అట. సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ఒక సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు ఈ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు రామ్. అప్పుడు తేజు దగ్గరకు వచ్చి, మైక్ తీసుకొని ‘నా లవ్ స్టోరీ కి ప్రత్యక్ష సాక్షి వీడే’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు రామ్ మాట్లాడుతూ ‘బ్రతికించావ్, అక్కడి వరకు పర్లేదు, కానీ నీ బ్రేకప్ కి కారణంగా నన్ను చూపించకపోతే చాలు’ అని అంటాడు. అప్పుడు తేజు మాట్లాడుతూ ‘నా లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం కూడా వీడే’ అని అంటాడు.

అందుకు రామ్ సమాధానం ఇస్తూ ‘ఆమె హీరోయిన్ అండీ..మేమిద్దరం కలిసి ఆమె చేసేవి చూశాం అంతే’ అని అన్నాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా నవ్వారు, అప్పుడు తేజు మళ్లీ మాట్లాడుతూ ‘ఆ హీరోయిన్ నా లవ్వండీ..కానీ వీడి వల్లే బ్రేకప్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విన్న తర్వాత ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?, అసలు ఏమి జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి . ఇకపోతే ‘హే భగవాన్’ చిత్రం ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుహాస్ హీరో గా నటించిన ఈ సినిమాలో, శివాని నాగారం హీరోయిన్ గా నటించగా, సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్రలో కనిపించాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper