spot_img
Homeఎంటర్టైన్మెంట్'ఆర్ఆర్ఆర్' విలన్ ట్రాక్ ఇదే !

‘ఆర్ఆర్ఆర్’ విలన్ ట్రాక్ ఇదే !

RRR movie
ఎస్.ఎస్. రాజమౌళి.. సీరియల్ డైరెక్టర్ నుండి నేషనల్ డైరెక్టర్ గా ఎదిగిన గ్రేట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే.. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రాజమౌళి ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి నటీనటుల్ని తీసుకున్నాడు. సినిమాలోనే ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. అలిసన్ డూడీ హాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి, అక్కడ బాగా గుర్తింపు పొందిన నటి. కాగా ఈమె ‘ఆర్ఆర్ఆర్’లో లేడీ స్కాట్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది.

Also Read: అగ్ర దర్శకుల బాటలో అనిల్ రావిపూడి.. ఏం చేశాడంటే?

పైగా సినిమాలో ఈమెనే ప్రధాన విలన్ అట. బ్రిటిష్ సంస్థానంలో ప్రముఖ అధికారిణిగా ఉండే ఈమె.. నల్లజాతి అంటూ భారతీయుల పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటుందని.. ఈ క్రమంలోనే ఈమె చేసే కొన్ని పనులు వల్ల వేలమంది ప్రజలు ఎన్నో బాధలు పడతారని.. అవన్నీ రాజమౌళి ప్రస్తుతం షూట్ చేస్తున్నారని.. ఈ రోజు అలిసన్ డూడీ షూట్ లో పాల్గొందని తెలుస్తోంది. కాగా అలిసన్ డూడీ కుమార్తె ఒలీవియా మోరిస్ అని.. భారతీయులను నిత్యం అసహ్యించుకునే ఈమె.. తన కూతురు కొమరం భీమ్ తో ప్రేమలో పడటం అస్సలు తట్టుకోలేకపోతుందట. దాంతో ఈమె చేసే పనులు వల్లే.. భీమ్ పై అటాక్ లు జరుగుతాయని.. పులితో చేసే ఫైట్ కూడా ఈమె వల్ల జరుగుతుందని.. ఇదే సినిమాలో ఈమె ట్రాక్ అని తెలుస్తోంది.

Also Read:  మెగా హీరో సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

ఇక అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముద్రఖని, అలియా భట్ లాంటి నటీ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జక్కన్న వీరి పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. డిసెంబర్ లో వీరందరి పై క్లైమాక్స్ ను షూట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇక చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. ఈ హీరోలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకి స్పెషల్ గా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ లో ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper