Homeఎంటర్టైన్మెంట్Ritu Chaudhary And Dimon Pawan: 'BB జోడీ 2' లో 5 ఎపిసోడ్స్ కోసం...

Ritu Chaudhary And Dimon Pawan: ‘BB జోడీ 2’ లో 5 ఎపిసోడ్స్ కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ జంట తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

Ritu Chaudhary And Dimon Pawan: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న షోస్ లో ఒకటి ‘BB జోడీ 2’. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే మొదలైన ఈ షోకి మొదటి ఎపిసోడ్ నుండే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ రేస్ అమర్ దీప్, నైనిక జంట, మానస్, శ్రేష్టి వర్మ జంట మధ్యనే ఉండబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సీజన్ […]

Ritu Chaudhary And Dimon Pawan: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న షోస్ లో ఒకటి ‘BB జోడీ 2’. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే మొదలైన ఈ షోకి మొదటి ఎపిసోడ్ నుండే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ రేస్ అమర్ దీప్, నైనిక జంట, మానస్, శ్రేష్టి వర్మ జంట మధ్యనే ఉండబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ‘బిగ్ బాస్ 9’ నుండి రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు ఎదో ఇరగ కుమ్మేస్తారని అందరూ బావిస్తే బిలో ఎవరేజ్ డ్యాన్స్ తో ఆడియన్స్ ని నిరాశకు గురి చేశారు. ఫలితంగా 5 ఎపిసోడ్స్ కే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఆదివారం రోజున ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా విడుదలైన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో రీతూ చౌదరి సరిగా డ్యాన్స్ చేయకపోవడం, ఇలాంటి మార్కులు, కామెంట్స్ వస్తాయని ముందుగానే ఊహించాను అని రీతూ అనడం, మా కోరియోగ్రాఫర్ సరైన కాన్సెప్ట్ ని ఎంచుకోలేదని నిందలు వేయడం, ఎందుకు కోరియోగ్రాఫర్ సమాధానం చెప్తూ, నాకు వాళ్లిద్దరూ సరిగా టైం ఇవ్వలేదు. సమయం ఇచ్చి ఉండుంటే అద్భుతంగా ఈ కాన్సెప్ట్ వచ్చేది అనడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే ఈ వారం గొడవలు గట్టిగానే జరిగే లాగా ఉన్నాయి.

అయితే గత రెండు వారాలు కంటెస్టెంట్స్ అందరికీ వచ్చిన మార్కులను కలిపితే అందరికంటే తక్కువ ఈ జంటకే రావడం తో ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఛాలెంజ్ లో వీళ్లిద్దరు ఓడిపోవడం తో ఈ షో నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ షో లో పాల్గొన్నందుకు ఈ జోడికి రెమ్యూనరేషన్ భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరికీ కలిపి ఒక్కో ఎపిసోడ్ కి మూడు లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా ఇచ్చేవారు అట. అంటే చెరో లక్షా 50 వేలు అన్నమాట. 5 వారాలు కొనసాగారు కాబట్టి, ఈ 5 వారాలకు వీళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపుగా 15 లక్షల రూపాయిలు వరకు ఉండొచ్చు. ఇద్దరికీ ఇదే తొలి డ్యాన్స్ రియాలిటీ షో. ఇంతకు ముందు ఎక్కడైనా చేసిన అనుభవం ఉండుంటే, ఇంకా కొన్ని రోజులు కొనసాగేవారేమో. వీళ్ళ అభిమానులు అయితే ఈ జంటకు సరైన డ్యాన్స్ మాస్టర్ దొరకకపోవడం వల్లే ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper