Bigg Boss 9 Telugu Ritu Chaudhary: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోని కంటెస్టెంట్స్ కొంతమంది చాలా బాగున్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు ఎందుకు వచ్చారు రా బాబు అన్నట్టు ఉన్నారు. అలాంటి వారిలో ఈ సీజన్ టాప్ 3 లిస్ట్ తీస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రీతూ చౌదరి(Ritu Chowdary) మరియు ఫ్లోరా షైనీ ఉంటారు. ఫ్లోరా షైనీ మిగిలిన ఇద్దరితో పోలిస్తే ఎంతో బెటర్ అనిపిస్తుంది. ఆమె హౌస్ లో ఏమి చేయకుండా ఒక మూలన కూర్చున్నప్పటికీ, క్రింజ్ కంటెంట్ ఇచ్చి ఆడియన్స్ ని హింస పెట్టడం లేదు. కానీ మిగిలిన ఇద్దరు మాత్రం రోజురోజుకి దిగజారిపోతున్నారు. డిమోన్ పవన్ కూడా తక్కువేం కాదు. టాస్కులు బాగా ఆడుతున్నాడు కానీ, రీతూ చౌదరి తో ఒక రేంజ్ లో పులిహోర కలుపుతున్నాడు. కర్మ ఏమిటంటే ఈమధ్య ఈ క్రింజ్ లవ్ స్టోరీ నే ఎక్కువగా ఎపిసోడ్స్ లో చూపిస్తున్నారు.
రీతూ చౌదరి టాస్కులు వచ్చినప్పుడు బాగానే ఆడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఆమె చేసే డ్రామాలు ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. ముఖ్యంగా కన్నీళ్లు రాకుండా వెక్కి వెక్కి ఏడ్చేది ఎలా అనే అంశం పై పోటీ పెడితే ఈమె గోల్డ్ మెడల్ సాధిస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొన్న కెప్టెన్సీ టాస్క్ లో చేసిన తప్పు గురించి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రీతూ ని బాగా ఎక్స్పోజ్ చేయడం తో ఆడియన్స్ ని ఏమార్చడానికి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి, అతన్ని గట్టిగా కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. సరే అక్కడ ఏడ్చింది, ఎదో ఆడియన్స్ లో తన మీద సానుభూతి కలగడానికి ఏడ్చింది అనుకుందాం. కానీ నిన్న బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఆమెకు చికెన్ ఇచ్చి తినమన్నప్పుడు కూడా మా అమ్మ గుర్తుకు వస్తుంది అంటూ మళ్లీ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది.
యాక్టింగ్ చేయాలని అనుకుంది ఒకే, కానీ జనాలు నమ్మే విధంగా యాక్టింగ్ చేయాలి కదా. ఇంతలా దొరికిపోయే రేంజ్ లో యాక్టింగ్ చేస్తే ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి. చూస్తుంటే ఈ వారం ఆమెకు ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ కూడా పడలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి రాబోయే రోజుల్లో చాలా మంది వైల్డ్ కార్డ్స్ గా రాబోతున్నారు. కాబట్టి ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ పెట్టాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయారు. ఈ డబుల్ ఎలిమినేషన్ లో రీతూ చౌదరి మరియు పవన్ కళ్యాణ్ ని బయటకు పంపే ప్లాన్ లో ఉన్నాడట బిగ్ బాస్. రీతూ నుండి అయినా ఎదో ఒక కంటెంట్ వస్తుంది,కానీ పవన్ కళ్యాణ్ నుండి మాత్రం అసలు ఏ కంటెంట్ రావడం లేదు. అందుకే అతన్ని పంపించేయడం బెటర్ అనే చర్చలు నడుస్తున్నాయట.