Bigg Boss 9 Telugu Ritu Chaudhary: టెలివిజన్ రంగంలో పెను సంచలనాలను సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ టాప్… 8 సీజన్లలో ఏ షో కి రాలేనంత టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఈ షో కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది… ఇక 13వ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది…13 వారాలుగా ఆమె అందించిన ఎంటర్ టైన్ మెంట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. టాస్క్ లోను రీతూ తన బెస్ట్ అయితే ఇచ్చింది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలాగే డిమాన్ పవన్ తో ప్రేమ వ్యవహారాన్ని కూడా నడిపింది. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేసింది. మొత్తానికైతే రీతూ చౌదరి ఉన్నంతసేపు బిగ్ బాస్ హౌస్ అంతా కోలాహలంగా ఉండేది. మరి ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్ కొంతవరకు డల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి… 13 వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు రీతూ చౌదరి దాదాపు 32.5 లక్షల రెమ్యునరేషన్ ను పొందినట్టుగా తెలుస్తోంది…
వారానికి 2.5 లక్షలను తీసుకుంది. ఇక మొత్తానికైతే తను ఇన్ని రోజులపాటు హౌస్ లో అందించిన ఎంటర్టైన్మెంట్ కి తనకు ఇచ్చింది చాలా తక్కువనే చెప్పాలి… నిజానికి ప్రతి టాక్స్ లో మెల్ కంటెస్టెంట్ లకు సైతం పోటీ ఇచ్చింది. అలాగే టాప్ 8 కాంటెస్టెంట్ వరకు నిలకడగా రాణిస్తూ వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక హౌజ్ లో లేడి చిరుత గా గుర్తింపును సంపాదించుకున్న రీతూ ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని తిరమైన దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. తన అభిమానులు సైతం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
ఇక బిగ్ బాస్ తో వచ్చిన ఇమేజ్ ను వాడుకొని ఆమె సీరియల్స్, షోస్, సినిమాల ద్వారా బిజీ అయిపోతుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే రీతు చౌదరి ఎలిమినేషన్ ను చాలా మంది నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించే వైరల్ అవుతోంది…