Bigg Boss 9 Telugu Ritu Chaudhary: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎక్కువ కాలం మాస్కులు వేసుకొని తిరగలేము. మహా అయితే ఒక్క వారం రోజులు మాస్కులో తిరగగలరు ఏమో కానీ, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడే సంఘటన కారణం గా సహజసిద్ధంగానే మాస్కులు తీసేయాల్సిందే. అక్కడ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ కి కూడా తెలీదు, మాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని. అలాంటి గేమ్ షో ఈ బిగ్ బాస్. గడిచిన రెండు మూడు ఎపిసోడ్స్ ద్వారా డ్రామా క్వీన్ రీతూ చౌదరి మాస్క్ మొత్తం వీడిపోయింది. ఈమె మరీ ఇంత దారుణంగా ఉందేంటి బాబోయ్, అదృష్టవంతురాలు, ఈ వారం నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి ఉండేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ తో తనూజ అంటే ఈమెకు ఎంత ద్వేషమో అర్థం అయిపోయింది.
ఇన్ని రోజులు సౌల్ మేట్స్, స్నేహితులు అంటూ చెప్పుకొచ్చిన రీతూ చౌదరి ది మొత్తం నాటకాలే అని నిన్నటి ఎపిసోడ్ తో తేలిపోయింది. అంతే కాదు ఈమె ఎంతటి ఫ్లిప్ స్టార్ అనేది కూడా ఈ వారం లో బయటపడింది. తనకు కావాల్సిన వాళ్లకు కెప్టెన్ చేయడానికి ఈమె తన సొంత టీం మేట్స్ కి ఉద్దేశపూర్వకంగా వేసిన వెన్నుపోటు బిగ్ బాస్ హిస్టరీ లో ఎవ్వరూ మర్చిపోలేరు. అంతే కాకుండా, ఇమ్మానుయేల్ స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా ఈమె కోల్పోయినట్టు అయ్యింది. ఎంతసేపు పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ లతో పులిహోర కలపడం, వాళ్ళతో ఉండడం కోసమే ఈమె నిన్న టాస్క్ అంత కసిగా ఆడడం వంటివి కోట్లాది మంది జనాలు చూసారు. ఈమె ఎలాగో నెగిటివ్ అయ్యింది, ఈమెతో పాటు ఎంతో మంచి పేరున్న రాము ని కూడా నెగిటివ్ చేసి పెట్టింది.
వివరాల్లోకి వెళ్తే రాము తో రీతూ చౌదరి రహస్యంగా ఒక డీల్ పెట్టుకుంది. ఇది మనకు ఎపిసోడ్ లో చూపించలేదు కానీ,లైవ్ లో జరిగింది. డీల్ ఏమిటంటే మన ఇద్దరం లోపలకు వెళ్ళాలి అని. కానీ బయటకు వచ్చిన తర్వాత రీతూ రాము బాస్కెట్ లో ఉన్న బాల్స్, బొమ్మలు మొత్తాన్ని ఖాళీ చేసి తన బాస్కెట్ లో వేసుకుంది. రాము కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంటి ఈమె నాతో మన ఇద్దరం మాత్రమే మిగలాలి అని నాతో డీల్ పెట్టుకొని, నన్నే ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కాసేపు బ్లాంక్ అయిపోయి అలా నిల్చున్నాడు. ఇమ్మానుయేల్ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో అని ఎంత గట్టిగా చెప్పినా రాము డిఫెండ్ చేసుకోలేదు. దీంతో పాపం రాము కూడా బాగా నెగిటివ్ అయిపోయాడు. కేవలం రీతూ చౌదరి కారణంగా టెనెంట్స్ మొత్తం బాధ పడాల్సిన పరిస్థితి వచ్చింది.