Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఊహించని ట్విస్టులతో, ఊహకందని ఎలిమినేషన్స్ తో ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసే విధంగా ముందుకు దూసుకుపోతోంది. ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో, ఎందుకు రీ ఎంట్రీ ఇస్తున్నారో, లోపల ఉన్న హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా అర్థం కావడం లేదు. అసలు అంచనాలే వెయ్యని విధంగా ఈ సీజన్ సాగుతోంది. కానీ టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రం సూపర్ హిట్ అనే రేంజ్ లో వస్తున్నాయి. గత సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో యావరేజ్ రేంజ్ లో నిల్చింది. ఒకానొక దశలో టీఆర్ఫీ రేటింగ్స్ ని చూసి సీజన్ 6 లాగా డిజాస్టర్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ యావరేజ్ తో సరిపెట్టుకుంది. కానీ ఈ సీజన్ మాత్రం సూపర్ హిట్. నిర్వాహకులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ఇకపోతే ఈ వారం ఒక్క ఇమ్మానుయేల్ తప్ప, హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తనూజ మొదటి స్థానంలో, పవన్ కళ్యాణ్ రెండవ స్థానం లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత మూడు మరియు నాల్గవ స్థానాల్లో సుమన్, భరణి సరిసమానమైన ఓటింగ్ శాతం తో ఉన్నారు. భరణి ఓటింగ్ గతం తో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. గత వారం లో లాగా ఆయన డేంజర్ జోన్ వరకు వచ్చే అవకాశాలు ఈసారి మాత్రం లేవు. వీళ్ళ తర్వాత ఐదవ స్థానం లో డిమోన్ పవన్ కొనసాగుతుండగా, ఆరవ స్థానం లో సంజన కొనసాగుతోంది. అయితే ఈ వారం దివ్య కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు ఓటింగ్ మంచిగానే పడుతుందట. ఈ వారం మొత్తం ఆమె కాస్త పాజిటివ్ గా ఉండడం, తన వంతు ఎంత కుదిరితే అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, టాస్కులు బాగా ఆడడం వంటివి చేసింది.
అంతే కాకుండా తనూజ తో కూడా మంచి క్లోజ్ గా ఉంటుంది. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆమెకు చాలావరకు సపోర్ట్ చేసింది. భరణి తో ఎప్పటి లాగానే బాగుంది కానీ, ఈసారి ఎందుకో పాజిటివ్ యాంగిల్ లోనే ఆడియన్స్ కి కనిపించింది. అందుకే ప్రస్తుతానికి ఈమె సేఫ్ గా ఉంది. ఇక చివరి మూడు స్థానాల్లో రీతూ చౌదరి, నిఖిల్, గౌరవ్ ఉన్నారు. వీరిలో రీతూ చౌదరి, గౌరవ్ ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీతూ చౌదరి ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అవుతుంది, గౌరవ్ కి తక్కువ ఓటింగ్ రావడం వల్ల ఎలిమినేట్ అవుతాడు. తనూజ కి గోల్డెన్ బజర్ ఉపయోగించే అవసరం రాదు అని నెటిజెన్స్ విశ్లేషిస్తున్నారు. కొంతమంది అయితే ఈ వారం అసలు ఎలిమినేషన్ ఉండదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.