Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Sree Vishnu Movie: రవితేజ , శ్రీవిష్ణు మల్టీస్టార్రర్ టైటిల్ ఇదే.. ఇంతటి...

Ravi Teja Sree Vishnu Movie: రవితేజ , శ్రీవిష్ణు మల్టీస్టార్రర్ టైటిల్ ఇదే.. ఇంతటి రొటీన్ టైటిల్ ఊహించలేదు..

Ravi Teja Sree Vishnu Movie: మాస్ మహారాజా రవితేజ , శ్రీవిష్ణు కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. హసిత్ గోలి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు ‘వీరాధి వీరులు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. హసిత్ గోలి గతం లో శ్రీవిష్ణు తో ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల టైటిల్స్ దగ్గర నుండి టేకింగ్ వరకు ప్రతీ ఒక్కటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడియన్స్ కి థియేటర్స్ లో సరికొత్త అనుభూతిని కూడా ఇచ్చాయి. ఇప్పుడు రవితేజ , శ్రీవిష్ణు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు కూడా టైటిల్ దగ్గర నుండే అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయేమో అని అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ‘వీరాధి వీరులు’ వంటి రొటీన్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ పట్ల అభిమానులు కాస్త నిరాశ చెందారు. హసిత్ గోలి ని చూస్తుంటే ఈసారి ఆయన డిఫరెంట్ సబ్జెక్టు తో కాకుండా మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారని తెలుస్తోంది. రవితేజ , శ్రీవిష్ణు లలో కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణ సన్నివేశాన్ని కూడా వీళ్లిద్దరు తమ కామెడీ టైమింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లగలరు. ఇలాంటి టైమింగ్ ఉన్న హీరోలను ఒకే సినిమాలో పెట్టుకొని , ప్రయోగాత్మక చిత్రాలు చేయడం సరైన నిర్ణయం కాదని డైరెక్టర్ అభిప్రాయం అట. అందుకే ఈ క్రేజీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా ఎవరెవరు నటించబోతున్నారు , ఇతర నటీనటుల సంగతి ఏంటి వంటి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం , వచ్చే నెల 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి , టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏ యాంగిల్ లో చూసినా ఈ చిత్రం రవితేజ కం బ్యాక్ మూవీ లాగానే అనిపిస్తోంది. ఇక శ్రీవిష్ణు అయితే వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు తో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సామజవరగమనా’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు , మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper