Comrade Kalyan: వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న శ్రీవిష్ణు , రీసెంట్ గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. విడుదలకు ముందు ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు. రేపు ఈ సినిమా విడుదల అనగా, శ్రీ విష్ణు సినిమా విడుదల అవుతుందా అని అనుకున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. అంతటి తక్కువ పబ్లిసిటీ తో విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండే ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 7 కోట్ల 50 లక్షల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం , కేవలం 4 రోజుల్లోనే 90 శాతానికి పైగా రీకవరీ ని సంపాదించి లాభాల్లోకి అడుగుపెట్టింది. నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంధ్ర ప్రదేశ్ లో 5 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక, ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపటి తో అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , శ్రీ విష్ణు కెరీర్ లో మరో క్లీన్ హిట్ గా నిలవబోతుంది ఈ చిత్రం.