Comrade Kalyan Movie: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న శ్రీ విష్ణు , రీసెంట్ గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే చిత్రంలో నటించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ ఈ చిత్రం లో భారీగా ఉన్నట్టుండి , కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే అనే ఫీలింగ్ ని కలిగించింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబందించిన ప్రివ్యూ షో ని హైదరాబాద్ లో నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు. ఈ షో కి మీడియా ప్రతినిధులతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కూడా వచ్చారు.
వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ ఫన్ తో పాటు మంచి సెంటిమెంట్ తో కూడిన సందేశం కూడా ఉంటుందని ఆంటున్నారు. కానీ సినిమాకు ఉన్న ఏకైక మైనస్ మ్యూజిక్. ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తించుకోదగినవి లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా యావరేజ్ గా ఉంది. కానీ శ్రీవిష్ణు మంచి ఫార్మ్ లో ఉన్నాడు కాబట్టి , కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కమెడియన్ సత్య తో శ్రీవిష్ణు సన్నివేశాలు అదిరిపోయాయి అట. సత్య కి మంచి కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు పడితే , ఏ రేంజ్ లో హిట్ అవుతాయో , రీసెంట్ గా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఒక బెస్ట్ ఉదాహరణ.
ఈ చిత్రం లో సత్య సన్నివేశాలు అంతకు మించి నవ్వు రప్పించే రేంజ్ లో ఉన్నాయని , కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. కానీ శ్రీవిష్ణు కి వరుస సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా , ఈ సినిమాకు ఎందుకో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పటి వరకు బుక్ మై షో యాప్ లో కనీసం ట్రెండింగ్ లోకి కూడా రాలేదు. రేపు పాజిటివ్ టాక్ వస్తే టికెట్స్ ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.