Comrade Kalyan Review: శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. శ్రీవిష్ణు సినిమా అంటేనే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది , పైగా వరుస సూపర్ హిట్స్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై పాజిటివ్ అంచనాలు ఆడియన్స్ లో ఏర్పడ్డాయి. టీజర్ , ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించాయి. కామెడీ తో పాటు మంచి యాక్షన్ ఉన్న పీరియడ్ డ్రామా మూవీ లా ఉందని అనిపించింది. మరి అదే ఫీలింగ్ నేడు థియేటర్స్ లో ప్రేక్షకులకు కూడా కలిగిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
90 వ దశకం లో ఆంధ్ర ప్రదేశ్ , ఒడిశా సరిహద్దు ప్రాంతం వద్ద , తాడికొండ కళ్యాణ్ (శ్రీ విష్ణు) అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను ఆ ఊర్లో ఒక థియేటర్ ని లీజుకి తీసుకొని నడిపిస్తూ ఉంటాడు. ఆ సమయం లో అక్కడి అడవుల్లో నక్సలైట్ దళాల ఏరివేత కోసం ఐపీఎస్ అధికారి జార్జ్ కుట్టి ని నియమిస్తారు. దీంతో జార్జ్ కుట్టి , మాస్టర్ దళానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఆ సమయం లోనే ఆ ఊర్లోకి ఒరియా కి చెందిన సితార దేవి అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంది. సితార దేవి ప్రాణాపాయ స్థితి లో ఉన్న తన తల్లి ని కాపాడడంతో , ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు కళ్యాణ్. సితార కుటుంబం పీకల్లోతు కష్టాల్లో ఉందనే విషయం తెలుసుకొని , ఎలా అయినా వాళ్ళని ఆ సమస్య నుండి గట్టెకించాలని అనుకుంటాడు. అందుకోసం తన స్నేహితుడు దుబాయ్ బాబు సాయం తో ఒక దారిని ఎంచుకుంటాడు. ఆ దారి కళ్యాణ్ జీవితాన్ని కీలక మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత అతని జీవితం లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ :
నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు సీరియస్ డ్రామా సినిమాలనే మనం చూస్తూ వచ్చాము. కానీ మొట్టమొదటి సారి ఈ జానర్ లో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్. చాలా వరకు డైరెక్టర్ ప్రేక్షకులను నవ్వించడం లో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా బాలయ్య అభిమాని గా సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ చేసే అల్లరి ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత హీరో శ్రీవిష్ణు ఆమె కోసం జైలు చుట్టూ తిరగడం , మధ్యలో హీరోయిన్ తో ప్రేమలో పడడం , తన ప్రేమని హీరోయిన్ కి వ్యక్తపరిచే సమయం లో శ్రీవిష్ణు పడిన తిప్పలు వంటివి చాలా ఫన్నీ గా అనిపిస్తాయి. ఇక దుబాయ్ బాబు గా కమెడియన్ సత్య ఎంటర్ అయ్యాక , కామెడీ లెవెల్ ఇంకా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా హీరో కోసం సత్య ఇంగ్లీష్ లో రాసే ఒక ప్రేమలేఖ సన్నివేశం ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశానికి ముందు జరిగే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అడవికి షిఫ్ట్ అవ్వడం తో , ఇక కామెడీ ఉండదేమో అని అనుకుంటాయి. కానీ సెకండ్ హాఫ్ ని కూడా కామెడీ తోనే నడిపించాడు డైరెక్టర్. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ బాగా పేలాయి. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ మిమ్మల్ని బాగా నవ్విస్తాడు. ఈ వీకెండ్ కి మీకు టైం పాస్ అవ్వాలంటే , ఈ సినిమాని మీ కుటుంబం తో కలిసి చూడాల్సిందే. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75 . మీరు ఈ సినిమాని చూసారా ?, చూస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.