Homeక్రీడలుLalit Modi: ఐపీఎల్ ను దోచేసి.. విదేశాల్లో అమ్మాయిలతో జల్సాలు.. వాహ్ లలిత్ మోడీజీ.. వైరల్...

Lalit Modi: ఐపీఎల్ ను దోచేసి.. విదేశాల్లో అమ్మాయిలతో జల్సాలు.. వాహ్ లలిత్ మోడీజీ.. వైరల్ వీడియో

Lalit Modi: ఓ 60 సంవత్సరాలు వయసుకు వచ్చిన తర్వాత చాలామంది విశ్రాంతిని కోరుకుంటారు. సాధ్యమైనంతవరకు సాత్వికమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. రోగాల బారిన పడకుండా ఉంటే చాలు అదే పదివేలు అని దేవుళ్లకు మొక్కుతారు. ఈ జాబితాలో లలిత్ మోడీ కాస్త డిఫరెంట్. ఎందుకంటే అతడు విలాస పురుషుడు. 60 సంవత్సరాల వయసు దాటుతున్నప్పటికీ అతడు ఇంకా పాతిక సంవత్సరాల కుర్రాడి మాదిరిగానే వ్యవహరిస్తున్నాడు. చుట్టూ అమ్మాయిలు.. అందులోనూ వాళ్లు మందేస్తుంటే […]

Lalit Modi: ఓ 60 సంవత్సరాలు వయసుకు వచ్చిన తర్వాత చాలామంది విశ్రాంతిని కోరుకుంటారు. సాధ్యమైనంతవరకు సాత్వికమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. రోగాల బారిన పడకుండా ఉంటే చాలు అదే పదివేలు అని దేవుళ్లకు మొక్కుతారు.

ఈ జాబితాలో లలిత్ మోడీ కాస్త డిఫరెంట్. ఎందుకంటే అతడు విలాస పురుషుడు. 60 సంవత్సరాల వయసు దాటుతున్నప్పటికీ అతడు ఇంకా పాతిక సంవత్సరాల కుర్రాడి మాదిరిగానే వ్యవహరిస్తున్నాడు. చుట్టూ అమ్మాయిలు.. అందులోనూ వాళ్లు మందేస్తుంటే ఇతగాడు చిందేస్తున్నాడు. వాళ్లంతా టూ పీస్ డ్రెస్లలో కనిపిస్తుంటే.. మనవాడు రెండు కళ్ళతో వారి సౌష్టవాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు. ఈ జన్మమే చూసేందుకు దొరికెరా అన్నట్టు పాటలు పాడుతున్నాడు.

లలిత్ మోడీ ఐపీఎల్ లో అక్రమాలు చేసిన తర్వాత.. ఇక్కడి పోలీసులకు దొరికిపోతానని.. భయంతో విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇక అప్పటినుంచి విదేశాల నుంచి అతను రావడం లేదు. రకరకాల దేశాలు తిరుగుతున్నాడు. తిరగడమే కాదు వాటి సంబంధించిన ఫోటోలను.. వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నాడు. కొంతమంది యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తనను తాను శుద్ధ పూసలాగా చెప్పుకుంటున్నాడు. తను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేద.. ఎటువంటి అన్యాయానికి ఒడి కట్టలేదని అంటున్నాడు.

లలిత్ అప్పట్లో సుస్మితసేన్ తో సంబంధంలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు గాని.. కొద్దిరోజులు వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము రేపాయి. ఇక ఆ తర్వాత వారిద్దరు విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు లలిత్ ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. కాకపోతే అక్కడ విలాసవంతమైన ఒక హోటల్లో అతడు జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతని చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారంతా మోడల్స్ లాగా కనిపిస్తున్నారు. వారు టూ పీస్ డ్రెస్లలో కనిపిస్తుండగా.. లలిత్ మోడీ వారిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మోడల్స్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే.. తడిసిన వారి అందాలను చూసి లలిత్ తన్మయత్వం చెందుతున్నాడు.

దోచుకున్న సొమ్ము.. దాచుకున్నాడు. ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు ఉన్న తర్వాత అతడికి వేరే స్వర్గంతో పనేముంది. సొంత దేశంతో అవసరమేముంది. ఇక్కడే అన్ని దొరుకుతున్న తర్వాత.. అతడు ఇక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడే అవకాశం లేదు. పైగా అతనికి విలాసం అంటే చాలా ఇష్టం. మహిళలతో ఆ విలాసాన్ని ఆస్వాదిస్తున్న అతడి తీరును చూసి చాలామంది కుళ్లుకుంటారు. అందులో అనుమానం లేదని.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lalit Modi (@lalitkmodi)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper