Rashmi Anasuya Controversy: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth Show) అనే పాపులర్ షో ద్వారా ఎంత మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బిగ్గెస్ట్ కామెడీ షో మొదలై 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు జబర్దస్త్ టీం. చాలా పెద్ద ఎపిసోడ్ అవ్వడం తో రెండు వారాలుగా ఈ ఎపిసోడ్ ని డివైడ్ చేసి టెలికాస్ట్ చేయబోతున్నారు. గత వారం లో యాంకర్ అనసూయ లేదు, కానీ ఈ వారం టెలికాస్ట్ చేయబోయే ఎపిసోడ్ లో ఆమె ఉంది. రష్మీ(Rashmi Gautam), అనసూయ(Anasuya Bharadwaj) ఇద్దరూ కూడా ఇంత సక్సెస్ అయ్యారంటే అందుకు మూల కారణం జబర్దస్త్, అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్లిద్దరి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు.
అయితే అనసూయ ఈ వారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటనకు తెరలేపింది. ఆమె మాట్లాడుతూ ‘జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదు అని అంటుంటారు. కానీ అవకాశాలు తప్పకుండా ఇస్తుంది. నేను కొన్ని ప్యాచప్స్ చేసుకోవాలి’ అంటూ రష్మీ ని గట్టిగ హత్తుకుంటుంది. మేమిద్దరం మళ్ళీ కలిసిపోవడం వల్ల ఎవరికీ తెలియని విషయాలు కూడా తెలిసిపోయేలా ఉన్నాయి అంటూ అనసూయ అంటుంది. అప్పుడు రష్మీ మాట్లాడుతూ ‘ఇదేదో వాట్సాప్ లో ఫోన్ చేసి మాట్లాడి ఉండుంటే అయిపోయేది కదా, ఎప్పుడో ప్యాచప్ అయ్యేవాళ్ళం’ అని అంటుంది. అప్పుడు అనసూయ ‘అప్పుడైతే కొన్ని ఈగోలు అడ్డొస్తాయి..ఇలా అయితే ఓకే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి?, యాంకర్ అనసూయ ఆ కారణం చేతనే జబర్దస్త్ వదిలి వెళ్లిపోయిందా?, అసలు ఏమి జరిగింది?, మ్యాటర్ ఏంటి అనేది లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.
Also Read: హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్ కి తెలియదా..? అలా ఎలా నోరు జారాడు?
ఈమధ్య కాలం లో జబర్దస్త్ రేటింగ్స్ బాగా పడిపోయాయి. కానీ రీసెంట్ గా ఈ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పెరిగాయని టాక్. ఈ ఎపిసోడ్ ఇచ్చిన కిక్ తో, ఇదే రేంజ్ ఫ్లో లో రాబోయే ఎపిసోడ్స్ కూడా ఉంటే మళ్ళీ జబర్దస్త్ షో ట్రాక్ లోకి వచ్చినట్టే. అయితే ఈ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్, అదే విధంగా ఇమ్మానుయేల్, ముక్కు అవినాష్ వంటి వారు లేకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసిన విషయం. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ కి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన లేకపోవడం అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.