Homeఎంటర్టైన్మెంట్Rajasekhar: అలాంటి సినిమాని హీరో రాజశేఖర్ ఈ జన్మలో చెయ్యలేడు అంటూ డైరెక్టర్ హాట్ కామెంట్స్..

Rajasekhar: అలాంటి సినిమాని హీరో రాజశేఖర్ ఈ జన్మలో చెయ్యలేడు అంటూ డైరెక్టర్ హాట్ కామెంట్స్..

Rajasekhar: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని సంపాదించి , ఎన్నో సంచలనాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించి , నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన నటుడు రాజశేఖర్. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి అంటే టక్కుమని అంకుశం , ఆవేశం వంటి సినిమాల పేర్లు మనకి గుర్తుకు వస్తుంటాయి. కానీ ఆయన కెరీర్ లో అతి పెద్ద మైల్ స్టోన్ […]

Rajasekhar: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ని సంపాదించి , ఎన్నో సంచలనాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించి , నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన నటుడు రాజశేఖర్. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి అంటే టక్కుమని అంకుశం , ఆవేశం వంటి సినిమాల పేర్లు మనకి గుర్తుకు వస్తుంటాయి. కానీ ఆయన కెరీర్ లో అతి పెద్ద మైల్ స్టోన్ లాంటి సినిమా ఏదైనా ఉందా అంటే , అది సింహరాశి మాత్రమే. కాలం గడిచే కొద్దీ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు నేటి తరం ప్రేక్షకులకు అవుట్ డేటెడ్ లాగా అనిపిస్తాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ప్రతీ తరానికి నచ్చే విధంగా ఉంటాయి, అలాంటి సినిమాల జాబితా లో ‘సింహరాశి’ కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ చిత్రాన్ని నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలా తీర్చి దిద్దారు డైరెక్టర్ సముద్ర. ఈ చిత్రం 1998 వ సంవత్సరం లో తమిళంలో విడుదలైన సిమ్మరాశి అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. శరత్ కుమార్ హీరో గా నటించిన ఈ చిత్రం అక్కడ భారీ కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ , తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా కథని మలిచి , రాజశేఖర్ ని హీరో గా పెట్టి ‘సింహరాశి’ పేరుతో రీమేక్ చేసి , 2001 వ సంవత్సరం లో విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం ఒక సంచలనం. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆ చిత్ర దర్శకుడు సముద్ర రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో నేను ఈ సినిమా రీమేక్ చెయ్యాలని అనుకున్నాను. ఈ ఆలోచనని నా టీం తో చర్చించాను. కానీ ఒక్కరు కూడా రీమేక్ చేయొచ్చు అని చెప్పలేదు. చాలా రిస్క్ , అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఇలాంటి సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఆదరించే ప్రసక్తే లేదు. హీరో నేల మీదనే కూర్చోవడం ఏంటి?, చూసేందుకు చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. అతని తల్లికి కుష్టి రోగం వచ్చిందని , అతన్ని ముట్టుకోకుండా పెంచింది, అందుకోసం హీరో హీరోయిన్ ని కూడా ముట్టుకోకపోవడం ఏంటి?, తల్లి , భార్య ఒక్కటేనా?, అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు అని చెప్పారు. కానీ నేను ఎవ్వరి మాట పట్టించుకోలేదు. నాకు ఈ సినిమా కథ అద్భుతంగా ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఏమి కథని పట్టుకొచ్చావయ్యా అని అన్నారు. ఆ తర్వాత ఆర్బీ చౌదరి గారు కూడా సినిమాని చూసి చాలా అద్భుతంగా తీశావని మెచ్చుకున్నారు. కానీ నా టీం మాత్రం ఎదో మీ అదృష్టం బాగుంటే ఈ సినిమా ఆడాల్సిందే కానీ , వర్కౌట్ అవ్వదండీ అని చెప్పారు. రాజశేఖర్ కి కూడా ఈ సినిమా మీద నమ్మకం ఉండేది కాదు. కానీ విడుదలై సూపర్ హిట్ అయ్యాక ఆయన కూడా షాక్ కి గురయ్యారు. కానీ రాజశేఖర్ ఎందుకో ఇప్పటికీ తన కెరీర్ బెస్ట్ మూవీస్ ఏంటంటే అంకుశం అనే చెప్తుంటాడు , సింహరాశి పేరు చెప్పడు . ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి చిత్రమిది. మళ్లీ చెయ్యాలన్నా ఇలాంటి సినిమా ఈ జన్మలో చెయ్యలేడు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper