Ranveer Singh: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గత కొద్ది రోజుల నుంచి సరైన సక్సెసులు లేక డీలా పడిపోతుంది. ఖాన్ త్రయం నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ లను మూట గట్టుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ ను కాపాడే వారెవరు లేరా అనే ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఇక గత సంవత్సరం రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది… 1300 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టడంతో రన్వీర్ సింగ్ కి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ ను సినిమా కూడా రాబట్టలేని రన్వీర్ సింగ్ ఏకంగా 1300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టే సినిమా చేయడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే టాప్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ను ఢీకొట్టగలిగే బాలీవుడ్ హీరో ఎవరు లేరు అంటూ కదా కొన్ని రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.
రన్వీర్ సింగ్ మాత్రం ప్రభాస్ సినిమాలను ఢీకొట్టగలిగే కెపాసిటి తనకి ఉందని తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ను ఢీకొట్టే కెపాసిటీ రన్వీర్ సింగ్ కైతే లేదని మరికొంతమంది నటి నటులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితమే ప్రభాస్ బాహుబలి సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.
ఇక అలాంటి ప్రభాస్ ను డీ కొట్టాలి అంటే మరి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తర్వాత రాబోయే సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది…ఇక రీసెంట్ గా చేసిన రాజాసాబ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…దాంతో ఆయన కొంత వరకు డీలా పడ్డాడు…