Homeఎంటర్టైన్మెంట్brahmanandam : కమెడియన్ బ్రహ్మానందం తో స్టార్ నిర్మాత కొట్లాట.. సంచలనం రేపుతున్న వీడియో..

brahmanandam : కమెడియన్ బ్రహ్మానందం తో స్టార్ నిర్మాత కొట్లాట.. సంచలనం రేపుతున్న వీడియో..

‘దూకుడు’ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ కి మాత్రమే కాదు , బ్రహ్మానందం కెరీర్ కి కూడా పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ చిత్రం కొత్త తరానికి చెందిన ప్రేక్షకులకు బ్రహ్మానందం ని మరింత చేరువ చేసింది. ఈ సినిమా తర్వాత అదే తరహా వార్తలు బ్రహ్మానందం కి క్యూ కట్టాయి. ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు సోషల్ మీడియా లో బ్రహ్మానందం […]

‘దూకుడు’ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ కి మాత్రమే కాదు , బ్రహ్మానందం కెరీర్ కి కూడా పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ చిత్రం కొత్త తరానికి చెందిన ప్రేక్షకులకు బ్రహ్మానందం ని మరింత చేరువ చేసింది. ఈ సినిమా తర్వాత అదే తరహా వార్తలు బ్రహ్మానందం కి క్యూ కట్టాయి. ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు సోషల్ మీడియా లో బ్రహ్మానందం పై ఇన్ని మీమ్స్ క్రియేట్ అయ్యాయంటే , అందుకు ‘దూకుడు’ చిత్రం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో బ్రహ్మానందం కూడా ఒకరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘పద్మశ్రీ’ గా ఆయన ఆ రేంజ్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నసమయం లో ఆ చిత్రం డైలాగ్స్, స్క్రిప్ట్ రైటర్ కోనవెంకట్ బ్రహ్మానందం తో జరిగిన ఒక గొడవ గురించి చెప్పుకొచ్చాడు. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘బ్రహ్మానందం గారితో మీరు సరదాగా చర్చిన సందర్భాలు ఉన్నాయా’ అని అడగ్గా , అందుకు కోనా వెంకట్ సమాధానం చెప్తూ ‘చర్చలు కాదు కానీ , ఆయనతో గొడవలు జరిగేవి. దూకుడు సినిమా షూటింగ్ లో మొదటి రోజు ఆయన పాల్గొన్నప్పుడు శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసాడు. పద్మశ్రీ పేరు మార్చాలని బ్రహ్మానందం గారు అంటున్నారు. నువ్వు వేరే పేరు ఏదైనా ఆలోచిస్తావా అని అడిగాడు. అప్పుడు షూటింగ్ ఆపు , నేను అక్కడికి వస్తున్నాను అని వెళ్లాను. ఏంటి గురువు గారు , ఏంటి సమస్య అని అడిగాను. అప్పుడు ఆయన పద్మశ్రీ అనే బిరుదు నాకు ఉంది కదా, ఇప్పుడు నేనే దాన్ని కామెడీ పాత్రకు వాడుకుంటే ఎగతాళి చేసినట్టు ఉంటుంది కదా అని అన్నాడు’.

‘అప్పుడు నేను సమాధానం చెప్తూ ఇదొక క్యారెక్టర్ , వాడొక యాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. వాడికి పద్మశ్రీ రాకపోయేసరికి , అదే వాడి పేరు గా మార్చేసుకున్నాడు. అది కేవలం క్యారెక్టర్ మాత్రమే , దాంతో మీకు వ్యక్తిగత పద్మశ్రీ కి సమస్య ఏంటి అని గొడవ పడ్డాను. అయితే క్యారెక్టర్ పేరు మార్చవా?, అని అన్నాడు , ఎట్టి పరిస్థితిలోనూ మార్చడం కుదరదు అని చెప్పి , ఆయనపై అలిగి డోర్ వేసి బయటకు వచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు యాంకర్ ‘అయితే సినిమా లో లాగానే షూటింగ్ క్యాన్సిల్ అని బయటకు వచ్చి చెప్పలేదా?’ అని అడగ్గా , ‘అవతల మహేష్ బాబు ఉన్నాడు. షూటింగ్ సెట్స్ లో బ్రహ్మానందం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక చేసేది ఏమి లేక బ్రహ్మానందం కాంప్రమైజ్ అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు కోన వెంకట్. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper