Homeఎంటర్టైన్మెంట్పవన్ ని ఢీ కొట్టనున్న రానా... ఆ క్రేజీ రీమేక్ స్టార్ట్

పవన్ ని ఢీ కొట్టనున్న రానా… ఆ క్రేజీ రీమేక్ స్టార్ట్

నిర్మాత సూర్యదేవర నాగవంశీ టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. ఏకంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఒకరితో మరొకరు తలపడేలా చేశాడు. ప్రకటనతోనే క్రేజ్ పీక్స్ కి చేరగా… ఈ మూవీ విశేషాలు మతిపోగొట్టేలా ఉన్నాయి. మలయాళ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. కథ రీత్యా ఇద్దరు హీరోలు నటించాల్సి ఉండగా.. అనేక మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ కి […]

Pawan Kalyan and Rana
నిర్మాత సూర్యదేవర నాగవంశీ టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. ఏకంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఒకరితో మరొకరు తలపడేలా చేశాడు. ప్రకటనతోనే క్రేజ్ పీక్స్ కి చేరగా… ఈ మూవీ విశేషాలు మతిపోగొట్టేలా ఉన్నాయి. మలయాళ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. కథ రీత్యా ఇద్దరు హీరోలు నటించాల్సి ఉండగా.. అనేక మంది స్టార్స్ పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ కి పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Also Read: క్రేజీ అప్డేట్: కెజిఎఫ్ 2 టీజర్ డేట్ వచ్చేసింది

మరి పవన్ నటిస్తున్నాడంటే అతనితో పాటు నటించే ఆ మరో హీరో ఎవరు అనేది కూడా ఆసక్తిగా మారింది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు నిన్న అధికారిక ప్రకటన విడుదల చేశారు. రానా లాంటి పాన్ ఇండియా నటుడు అయ్యప్పనుమ్ కోశియుమ్ కి సైన్ చేసి హైప్ మరింత పెంచేశారు. ఒక ఊరిలో ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య నడిచే ఆధిపత్య పోరునే ఈ చిత్రం. ఎక్స్ మిలిటరీ అధికారి, పోలీసు ఒకరినొకరు తలపెడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో దర్శకుడు సాచి అద్భుతంగా చూపించారు.

Also Read: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

2020లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో ఈ మూవీ రీమేక్ హక్కులు సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. నేడు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. గతంలో ఒప్పుకున్న చిత్రాలను కూడా పక్కన బెట్టి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper