Korean Kanakaraju Trailer Review: ‘ వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఈ నెల 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ టీం. ముఖ్యంగా వరుణ్ తేజ్ , కమెడియన్ సత్య కలిసి ఇస్తున్న ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అయ్యాయి , యూత్ ఆడియన్స్ ఈ ఇంటర్వ్యూస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం లోని పాటలకు , టీజర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. హైదరాబాద్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మరి ట్రైలర్ ఎలా ఉంది?, వరుణ్ తేజ్ ఈ చిత్రం తో కం బ్యాక్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
టీజర్ చూసినప్పుడే మన అందరికీ ఈ సినిమా స్టోరీ పై ఒక క్లారిటీ వచ్చేసింది. చిత్తూరు కి చెందిన ఒక కుర్రాడి శరీరం లోకి , కొరియన్ దేశానికీ చెందిన ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దినట్టుగా తెలుస్తోంది. అయితే హీరో శరీరం లోకి దూరిన ఆత్మ మంచి లక్షణాలు కలిగినదా?, లేదా చెడు లక్షణాలు కలిగినదా?, ఈ ఆత్మా కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు అనేది స్టోరీ అన్నట్టుగా ఈ ట్రైలర్ లో చూపించారు. చివరి షాట్ ని చూస్తుంటే , హీరో ఆత్మా , కొరియన్ ఆత్మతో పోరాడుతున్నట్టుగా చూపించారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. దీనిని బట్టీ అర్థం అవుతున్నది ఏమిటంటే , విలన్ ఆత్మా హీరో శరీరం లోకి దూరింది , దాని నుండి హీరో ఎలా సురక్షితంగా బయటపడ్డాడు అనేది స్టోరీ అని.
ఇక నీటనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఎప్పటిలాగానే విభిన్నమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఊర మాస్ కుర్రాడి పాత్రలో , అదే విధంగా కొరియన్ పాత్రలో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించబోతున్నాడు అనేది అర్థం అవుతోంది. అదే విధంగా ఆయన స్నేహితుడి పాత్రలో సత్య కూడా అదరగొట్టినట్టు తెలుస్తోంది. సినిమాకు ఆయన పాత్ర పెద్ద హైలైట్ గా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ , ఈసారి వరుణ్ తేజ్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా, పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చేసినట్టుగా అనిపిస్తోంది. మరి ఈ చిత్రం తో ఆయన కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.