Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళ కోసమే శూర్పణఖ క్యారెక్టర్ చేశానంటూ రకుల్...

Rakul Preet Singh: అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళ కోసమే శూర్పణఖ క్యారెక్టర్ చేశానంటూ రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్..

Rakul Preet Singh: ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ‘రామాయన్’ ట్రైలర్ లో ఆమె శూర్పణఖ గా కనిపించడమే. మన పాత రామాయణం కి సంబంధించిన సినిమాల్లో ‘శూర్పణఖ’ ని ఎంతో వికారం గా చూపించేవారు. కానీ లేటెస్ట్ ‘రామాయన్’ మూవీ లో ‘శూర్పణఖ’ ని ఎంతో అందంగా చూపించారు. ఒక విధంగా […]

Rakul Preet Singh: ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ‘రామాయన్’ ట్రైలర్ లో ఆమె శూర్పణఖ గా కనిపించడమే. మన పాత రామాయణం కి సంబంధించిన సినిమాల్లో ‘శూర్పణఖ’ ని ఎంతో వికారం గా చూపించేవారు. కానీ లేటెస్ట్ ‘రామాయన్’ మూవీ లో ‘శూర్పణఖ’ ని ఎంతో అందంగా చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే అందంతో రకుల్ ప్రీత్ ‘శూర్పణఖ’ గా ‘సీత’ క్యారెక్టర్ చేస్తున్న సాయి పల్లవి ని డామినేట్ చేసింది అనే చెప్పాలి. ఒక రాక్షసి క్యారెక్టర్ కి రకుల్ ప్రీత్ ని ఎంచుకోవడం చాలా బాధాకరం , ఆమె రేంజ్ కి సీత పాత్ర పోషించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

ట్రైలర్ లో రకుల్ ప్రీత్ ముక్కు ని కట్ చేసే షాట్స్ చూపించడం తో, అంత అందమైన అమ్మాయి ముక్కు కట్ చెయ్యాలని ఎలా అనిపించింది అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఈ క్యారెక్టర్ చేయడానికి గల ముఖ్య కారణాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె మాట్లాడుతూ ‘శూర్పణఖ పాత్రలో అనేక కోణాలు ఉన్నాయి. అవి వెండితెర పై ఆవిష్కరించడానికి చాలా ఛాలెంజింగ్ గా అనిపించడం వల్లే , ఈ పాత్ర ని నేను ఎంచుకున్నాను. చరిత్ర ఆమెని కేవలం ఒక ఘట్టం గానే గుర్తు పెట్టుకుంది. కానీ ఆమె జీవితం లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఒక నటిగా ప్రేక్షకుల్లో ఆ క్యారెక్టర్ పై ఉన్నటువంటి పాత ఆలోచనలను , అభిప్రాయాలను మార్చే విధంగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంతో వెంటనే ఓకే చెప్పేసాను’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు శూర్పణఖ క్యారెక్టర్ ని తమ విశాల హృదయం తో అర్థం చేసుకుంటారని రకుల్ ప్రీత్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఎంతైనా ‘శూర్పణఖ ‘ అంటే విలన్ క్యారెక్టర్. ఒకపక్క మెయిన్ లీడింగ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ , సాయి పల్లవి కంటే సీనియర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని , ఆమె సీత పాత్రలో కనిపించడం , మీరు విలన్ పాత్రలో కనిపించడం అసలు జీర్ణించుకోలేని విషయం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి విడుదల తర్వాత ఈమె పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper