Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi Ramayan: సాయి పల్లవి కి ఊహించని షాక్ ఇచ్చిన హిందీ 'రామాయణ్' టీం..పెద్ద...

Sai Pallavi Ramayan: సాయి పల్లవి కి ఊహించని షాక్ ఇచ్చిన హిందీ ‘రామాయణ్’ టీం..పెద్ద అవమానమే ఇది…

Sai Pallavi Ramayan: మన తెలుగు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సాయి పల్లవి , రీసెంట్ గానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’, కానీ అంతకంటే ముందే ‘ఏక్ దిన్’ అనే చిత్రం విడుదలైంది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం లో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ […]

Sai Pallavi Ramayan: మన తెలుగు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సాయి పల్లవి , రీసెంట్ గానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’, కానీ అంతకంటే ముందే ‘ఏక్ దిన్’ అనే చిత్రం విడుదలైంది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం లో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించాడు. ఈ సినిమాకు మొదటి రోజు , మొదటి ఆట నుండే ఘోరమైన నెగెటివ్ టాక్ రావడం తో , డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది , కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. తెలుగు లో ఈ చిత్రం ‘ఒక్క రోజు’ అనే పేరుతో విడుదలైంది , ఇక్కడ కూడా ఈ సినిమా ఒక్క రోజే ఆడింది , అంత పెద్ద ఫ్లాప్ అన్నమాట.

ఈ సినిమా తర్వాత విడుదలయ్యే ‘రామాయణ్’ అయినా సాయి పల్లవి అదృష్టాన్ని మారుస్తుందో లేదో చూడాలి. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. వందల కోట్ల బడ్జెట్ అని ఊదరగొట్టారు , కానీ అక్కడ చూస్తుంటే టీవీ సీరియల్స్ క్వాలిటీ రేంజ్ విజువల్స్ కనిపిస్తున్నాయి అంటూ ఈ టీజర్ విడుదలైనప్పుడు నెటిజెన్స్ విమర్శలు చేశారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ మూవీ టీం సాయి పల్లవి కి ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చింది. అదేమిటంటే సాయి పల్లవి ఏ భాషలో నటించినా , ఆమె తన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అలవాటు. అదే విధంగా ‘రామాయణ్ ‘ కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పాలని అనుకుంది. కానీ డైరెక్టర్ నితీష్ తివారీ అందుకు ఒప్పుకోలేదు.

కారణం సీత పాత్రకు హిందీ లో పలకాల్సిన డిక్షన్ తో సాయి పల్లవి డైలాగ్స్ చెప్పలేకపోతుందట. పవర్ ఫుల్ ఫీల్స్ ని ఆమె వాయిస్ ఇవ్వకపోవడం తో , వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని నితీష్ తివారీ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్నీ సాయి పల్లవి కి కూడా చెప్పారట , మొదట్లో ఆమె కాస్త బాధ పడిందట కానీ, ఔట్పుట్ ముఖ్యం కదా అని కాంప్రమైజ్ అయ్యిందట, కానీ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు , సాయి పల్లవి కి ఘోరమైన అవమానం జరిగింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, రాముడిగా రణబీర్ కపూర్ , రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper