Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi Trolls: హీరోయిన్ సాయి పల్లవి పై దారుణమైన ట్రోల్స్.. చూస్తే కన్నీళ్లు ఆగవు..

Sai Pallavi Trolls: హీరోయిన్ సాయి పల్లవి పై దారుణమైన ట్రోల్స్.. చూస్తే కన్నీళ్లు ఆగవు..

Sai Pallavi Trolls: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి కి ఇండియా వైడ్ గా ఉన్నటువంటి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఈమెని అభిమానులు ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే ఈమె అందాల ఆరబోత వంటి వాటికి దూరం. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఇప్పటి వరకు చేస్తూ వచ్చింది. అందుకే సాయి […]

Sai Pallavi Trolls: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి కి ఇండియా వైడ్ గా ఉన్నటువంటి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఈమెని అభిమానులు ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే ఈమె అందాల ఆరబోత వంటి వాటికి దూరం. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఇప్పటి వరకు చేస్తూ వచ్చింది. అందుకే సాయి పల్లవి అంటే అంతటి క్రేజ్ ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ఈమె క్రేజ్ కేవలం సౌత్ కి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండేది, కానీ ఇప్పుడు ఆమె క్రేజ్ బాలీవుడ్ వరకు ఎగబాకింది. నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4000 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘రామాయన్’ లో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తోంది.

అయితే నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో సీత గెటప్ లో ఉన్నటువంటి సాయి పల్లవి ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవి ఈ పాత్రకు అసలు సూట్ అవ్వలేదని , ఆమెకంటే ఆమె పక్కన ఉన్నటువంటి చెలికత్తె లు బాగున్నారని, అసలు డైరెక్టర్ నితీష్ తివారి కి ఈమెని సీత క్యారెక్టర్ కి తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో అంటూ నెటిజెన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి అందమైన అమ్మాయిని సూర్పనక్క లాంటి రాక్షసి క్యారెక్టర్ కి ఎంచుకోవడం అన్యాయమని, ఆ పాత్రకు సాయి పల్లవి ని తీసుకొని , రకుల్ తో సీత క్యారెక్టర్ చేయించి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. సీత పాత్ర చెయ్యాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు , అభినయం , అద్భుతమైన నటన ఉండాలి. అవి రెండు ఉన్నాయి కాబట్టే సాయి పల్లవి ని ఎంచుకున్నారు. ఈ జనరేషన్ లో సీత పాత్రకు న్యాయం చేయగల ఏకైక హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే, ఇప్పుడు ట్రోల్స్ చేసిన వాళ్ళే , రేపు సినిమా విడుదలయ్యాక ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తారు అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్. ఇక విశ్లేషకులు అయితే , సాయి పల్లవి పై ఈ స్థాయి ట్రోలింగ్స్ జరగడం అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమె పై వచ్చిన ట్రోల్స్ , అలాగే పాజిటివ్ పోస్టులను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper